Begin typing your search above and press return to search.

పొట్ట పెరుగుతుందని బాధలో ఉన్నారా? ఈయన గురించి చదవాల్సిందే

By:  Tupaki Desk   |   27 Jun 2023 6:00 AM GMT
పొట్ట పెరుగుతుందని బాధలో ఉన్నారా? ఈయన గురించి చదవాల్సిందే
X
మనం తినే ఆహారం.. మన అలవాట్ల వలన కొంతమందికి 20 ఏళ్లకే పొట్ట వస్తోంది. 30 ఏళ్లకే వ్యాధుల బారిన పడుతున్నారు. కరోనా తర్వాత చాలా మంది వర్క్ ఫ్రం హోం కు అంకితం అయి... బద్ధకంగా తయారయ్యారు. కనీసం యువకులు కూడా తమ శరీరాన్ని కాపాడుకోవడం లేదు. చాలా మంది నెగ్లెక్ట్ చేసి.. అనారోగ్య పాలై అవస్థలు పడుతున్నారు.

అయితే ఓ 73 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి.. మారథాన్, వ్యాయమం, బాడీ బిల్డింగ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. అదేంటి అని షాక్ అవుతున్నారా... 73 ఏళ్ల వ్యక్తి ఏంటి.. ఇలా చేయడం అని.. నిజమేనండి.. కేరళ కు చెందిన వేంకటేష్‌ ప్రభు.. ఇలా వ్యాయమం చేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.

వేంకటేష్ ప్రభు ప్రస్తుతం సింగపూర్‌ లో స్థిరపడ్డారు. ఆయన పదవీ విరమణ పొందిన తర్వాత అందరిలా ఇంట్లో ఖాళీ గా కూర్చోవాలనుకోలేదు. ఖాలీగా కూర్చొని తిని రెస్ట్ తీసుకోవాలని అనుకోలేదు. అది గ్రహించిన అతడి కూతురు ఇచ్చిన సలహా మేరకు 58 ఏళ్ల వయసు లో పరుగు ప్రారంభించాడు.

ఇక అప్పటి నుంచి ఆయన పరుగు ఆగలేదు. కేవలం 15 సంవత్సరాల్లోనే 50 మారథాన్‌ల ను పూర్తి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. 73 ఏళ్ల వయసులోనూ ఆగకుండా 21 కిలోమీటర్లు పరుగెత్తి అందరినీ ఆశ్చర్యపరచాడు. అంతేకాదు, ఈ వయసులో నూ బాడీ బిల్డర్‌ లా బరువులెత్తగలడు. వ్యాయమం చేస్తూ.. బాడీని ఫిట్ గా మార్చుకున్నాడు.

ప్రస్తుతం సొంతంగా ఓ ఫిట్‌ నెస్‌ సెంటర్‌ ని ప్రారంభించాడు వేంకటేష్ ప్రభు. తనలాంటి ఎంతోమంది వయో వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు ఆయన. ఇంతకీ తన ఆరోగ్య రహస్యం ఏమిట ని అడిగితే... ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూండటం అని చెప్పుకొచ్చాడు. దాని తో పాటు మంచి ఆహారం తీసుకుంటాడట. ఉదయాన్నే లేచి.. వ్యాయమం చేసి.. డైట్ ను మెంటైన్ చేస్తాను అంటున్నాడు. ఇక ఈయన గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మాకు కూడా ట్రైనింగ్ ఇవ్వండి తాతా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.