Begin typing your search above and press return to search.

కోపంతో టాటాకు సుధా మూర్తి లేఖ.. అసలేం జరిగిందంటే..

By:  Tupaki Desk   |   18 May 2023 6:19 PM GMT
కోపంతో టాటాకు సుధా మూర్తి లేఖ.. అసలేం జరిగిందంటే..
X
మానవతా మూర్తి సుధా మూర్తి. ఎంతో ఓపికగా, చిరునవ్వుతో ఉండే ఆమెకు కోపం వచ్చిందంటే ఎవరూ నమ్మరు. కానీ ఆమె కోపంతో ఊగిపోయారట. ఆగ్రహంతో ఏకంగా టాటాకే లెటర్ రాశారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించారు. అసలు ఆ మానవతా మూర్తికి కోపం ఎందుకు వచ్చింది.?

ప్రముఖ రచయిత్రి, మానవతా మూర్తిసుధా మూర్తి. ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి. ఈమె ఇటీవల వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఈమధ్య ది కపిల్ శర్మ షో లో తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను ఆమె వివరించారు. ఇందులో భాగంగానే ఆమె జే ఆర్ డి టాటా కు కోపంతో లేఖ రాసిన ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. అదీ ఆమె చదువుకునే రోజుల్లో. అప్పుడు ఆమె వయస్సు 23 సంవత్సరాలు.

1974లో బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్లో సుధా మూర్తి ఎంటెక్ చదువుతున్నారు. తరగతిలో అంతా అబ్బాయిలే. సుధామూర్తి మాత్రమే మహిళ. 1972లో బిఈ చేసిన సమయంలోనూ క్లాసులో సుధా మూర్తి ఒక్కరే అమ్మాయి. ఓ రోజు ఆమె తరగతి నుండి హాస్టల్ కు వెళుతుండగా నోటీసు బోర్డు చూశారట. అందులో ఒక ఉద్యోగ. ప్రకటన ఉంది పూణేలోని టెల్కోలో పనిచేసేందుకు ఉత్సాహవంతమైన యువకులు మాత్రమే కావాలని ఉంది. మంచి వేతనం ఇస్తామని తెలిపారు. కానీ చివరిలో యువతులు మాత్రం దరఖాస్తు చేయడానికి వీలు లేదని రాసి ఉంది. దీంతో సుధా మూర్తి కోపంతో ఊగిపోయారు. వెంటనే టాటాకు ఓ లేఖ రాశారు.

"దేశానికి స్వాతంత్రం రాకముందే మీ కంపెనీ కెమికల్స్, లోకోమోటివ్, ఐరన్, స్టీల్ వంటి పరిశ్రమలు ప్రారంభించింది. సమయం కంటే మీరు చాలా ముందున్నారు. అయితే సమాజంలో 50 శాతం పురుషులుంటే 50 శాతం మహిళలున్నారనే విషయం గుర్తుంచుకోవాలి. మీరు మహిళలకు అవకాశం ఇవ్వకపోతే మహిళల సేవల్ని నిలిపివేస్తున్నట్టే లెక్క. దీని అర్థం దేశం అభివృద్ధి చెందదన్నమాట. మహిళలకు విద్య అందక, ఉద్యోగం పొందకపోతే సమాజం, దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఇది మీ కంపెనీలో ఒక పెద్ద తప్పు" అని ఆ లేఖలో రాసినట్లు సుధా మూర్తి వివరించారు.

అయితే టాటా తన పుట్టినరోజును జరుపుకునేందుకు ప్రతి సంవత్సరం మార్చి 15న తమ ఇన్స్టిట్యూట్ కు వచ్చేవారని చెప్పారు సుధా మూర్తి. కానీ భయంతో తాను తాటాను దూరం నుంచే చూశానని ఆమె ఈ షోలో చెప్పుకొచ్చారు. కపిల్ శర్మ షోలో సుధా మూర్తి చెప్పిన విషయాల పై ఇంటర్నెట్లో చర్చ నడుస్తోంది. మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అంతగా చోటు లేని రోజుల్లో సుధామూర్తి ధైర్యాన్ని విని అంత ఆశ్చర్యానికి లోనయ్యారు. కొసమెరుపు ఏంటంటే సుధా మూర్తి రాసిన లేఖ టాటా గ్రూప్ పై బాగానే పనిచేసింది. మహిళలకు అవకాశం ఉండదన్న పాలసీని ఆ తర్వాత టాటా గ్రూప్ తొలగించింది.