Begin typing your search above and press return to search.

ఏపీలో మందు మానేసిన మందుబాబులు?

By:  Tupaki Desk   |   26 May 2021 2:30 AM GMT
ఏపీలో మందు మానేసిన మందుబాబులు?
X
దేశంలో ఇప్పుడు ప్రభుత్వాలకు ఆదాయాన్ని ఇచ్చేది పెట్రోల్, డీజీల్, మద్యమే. అందుకే వాటిపై భారీగా వడ్డిస్తున్నారు. ఎంత నిరసన వ్యక్తం అవుతున్నా కూడా వాటిని బంద్ చేయడం లేదు. తెలంగాణలో లాక్ డౌన్ విధించినా ఉదయం పూట వైన్స్ తెరుస్తున్న పరిస్థితి నెలకొంది. మద్యం మీద ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్న పరిస్థితి నెలకొంది.

ఈ మండు వేసవిలో బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గడం ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరుస్తోంది. షాపుల సంఖ్య తగ్గించడమా? లేక కర్ఫ్యూ ప్రభావమో తెలియదు కానీ రికార్డు స్థాయిలో అమ్మకాలు పడిపోయాయి.

కర్ఫ్యూ కారణంగా ఏపీలో మద్యం దుకాణాల సమయాలను తగ్గించారు. దీంతో ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో అమ్మకాలు బాగా తగ్గాయి. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు రాష్ట్రంలో బీరు, లిక్కర్ కలిపి మొత్తం 21,31,558 కేసుల విక్రయాలు మాత్రమే సాగాయి. మే నెలలో ఈ సంఖ్య 16.74 లక్షలకు పడిపోయింది. తద్వారా మద్యం అమ్మకాల శాతం 2145 శాతం పడిపోయింది.

ఇక బీర్ల అమ్మకాల్లో అయితే ఏకంగా 52.37శాతం తగ్గుదల నమోదైంది. దీంతో ఏపీ సర్కార్ ఆదాయానికి కర్ఫ్యూ వల్ల భారీగా గండిపడింది. గతంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు భారీగా పడిపోయాయని బీర్ల అమ్మకాలు సైతం పెరగలేదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.