Begin typing your search above and press return to search.

ఇలాంటి ప్రత్యేకత తార్నాకకు మాత్రమే సొంతం

By:  Tupaki Desk   |   12 Feb 2021 10:30 AM GMT
ఇలాంటి ప్రత్యేకత తార్నాకకు మాత్రమే సొంతం
X
గ్రేటర్ హైదరాబాద్ పాలకమండలి కొలువు తీరింది. 150 మంది సభ్యుల్లో ఒకరు మరణించిన నేపథ్యంలో 149 మంది సభ్యులు మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. ఇదిలా ఉంటే.. మేయర్ గా గద్వాల్ విజయలక్ష్మిని ఎంపిక చేయగా.. డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలతారెడ్డి ఎంపికయ్యారు. గ్రేటర్ పరిధిలోని 150 వార్డుల్లో మరెక్కడా లేని ప్రత్యేకత తార్నాక సొంతమని చెప్పాలి.

ఎందుకంటే.. ప్రస్తుతం జీహెచ్ఎంసీగా ఉన్న గ్రేటర్ మహాపాలక సంస్థ మొదట ఎంసీహెచ్ గా ఉండేది. ఎప్పుడైతే జీహెచ్ఎంసీగా అవతరించిన తర్వాత.. మొదటి మహిళా మేయర్ గా బండ కార్తీకా రెడ్డి వ్యవహరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆమె తార్నాక వార్డు నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. తొలిసారి డిప్యూటీ మేయర్ గా ఎంపికైన శ్రీలతా రెడ్డి సైతం తార్నాక వార్డు నుంచి కార్పొరేటర్ గా గెలిచిన వారే కావటం.

అంటే.. తొలి మహిళా మేయర్ ను.. తొలి డిప్యూటీ మేయర్ ను అందించిన వార్డుగా తార్నాక నిలిచింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే..తొలి మహిళా మేయర్ గా వ్యవహరించిన బండ కార్తీక రెడ్డి దగ్గరి బంధువు మీదనే శ్రీలతా రెడ్డి విజయం సాధించటం. మహా నగరంలో 150 వార్డులు ఉన్నప్పటికి.. ఇలాంటి అరుదైన రికార్డు మాత్రం తార్నాకకు మాత్రమే సొంతమని చెప్పక తప్పదు.