Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్​తో అంబులెన్స్​ డ్రైవర్ మృతి.. కేంద్రం ఆరా..!

By:  Tupaki Desk   |   21 Jan 2021 6:58 AM GMT
కరోనా వ్యాక్సిన్​తో అంబులెన్స్​ డ్రైవర్ మృతి.. కేంద్రం ఆరా..!
X
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తీసుకొని ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్​, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోగా.. గత మంగళవారం తెలంగాణలోని నిర్మల్​ జిల్లాకు చెందిన ఓ ఆంబులెన్స్​ డ్రైవర్​ వ్యాక్సిన్​ తీసుకున్న 24 గంటల్లోపే మృతిచెందాడు. వరస ఘటనలతో కేంద్ర ఆరోగ్యశాఖ అలర్టయ్యింది. మృతిచెందిన వారి వివరాలు తెలుసుకుంటున్నది. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నది. వాళ్లు వ్యాక్సిన్​ తీసుకున్నాకే చనిపోయారా? లేక ఇతర కారణాలతో చనిపోయారా? అన్న విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ దర్యాప్తు చేయనున్నది.

ఆయా రాష్ట్రాల్లో వ్యాక్సిన్​ తీసుకొని ముగ్గురు మృతిచెందడంతో ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాక్సిన్​ తీసుకున్న కొంతమందిలో సైడ్​ఎఫెక్ట్స్​ కూడా వస్తున్నాయి. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అలర్టయ్యింది. వ్యాక్సిన్​పై ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని కేంద్రం సూచిస్తున్నది. ఇటీవల దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్​ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ముందుగా ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు వ్యాక్సిన్​ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్​ జిల్లాకు చెందిన ఓ అంబులెన్స్​ డ్రైవర్​ కరోనా వ్యాక్సిన్​ తీసుకున్న 24 గంటల్లోనే మృతిచెందాడు. అతడు వ్యాక్సిన్​ దుష్ప్రభావం వల్ల అతడు చనిపోలేదని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. అంబులెన్స్​ డ్రైవర్​ మంగళవారం ఉదయం వ్యాక్సిన్​ తీసుకున్నాడు. అయితే అదే రోజు అర్ధరాత్రి అతడికి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. అయితే అతడు గుండెపోటుతో మృతిచెందాడని డాక్టర్లు అంటున్నారు.

వ్యాక్సిన్​ తీసుకోవడానికి.. అతడు చనిపోవడానికి ఏ రకమైన సంబంధం లేదని వాళ్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనను కేంద్రప్రభుత్వం సీరియస్​గా తీసుకున్నది. అంబులెన్స్​ డ్రైవర్​ ఎలా మృతిచెందాడు? అన్న విషయంపై ఆరా తీస్తున్నది. ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్​ లో ఒకరు, కర్ణాటకల్లోనూ మరొకరు వ్యాక్సిన్​ తీసుకున్నాక మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. మరోవైపు ఇతర రాష్ట్రాల ఘటనలపై కూడా కేంద్ర ఆరోగ్యశాఖ ఆరా తీస్తున్నది.