Begin typing your search above and press return to search.
మోడీని పట్టుకుని పెద్ద మాటే అనేసిన స్వామి
By: Tupaki Desk | 17 Jun 2023 8:00 PM GMTప్రధాని నరేంద్ర మోడీని పట్టుకుని చాలా పెద్ద మాట అనేశారు కేంద్రంలో ఆర్ధిక మంత్రిగా ఒకనాడు పనిచేసిన సుబ్రమణ్యస్వామి. ఆయన ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం దేశానికి ఆర్ధిక మంత్రిగా కొంతకాలం సేవలు అందించారు. ఇక బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా మోడీ ప్రధానిగా ఉన్న టైం లో ఉన్నారు.
ఆయనకు మరోసారి రాజ్యసభ సీటు ఇవ్వలేదు, ఆయన కోరుకున్న ఆర్ధిక మంత్రినీ చేయలేదు. దాంతో ఆయనకు మోడీ అంటే విపరీతమైన కోపం అని అంటూంటారు. ఆయన ఇప్పటికి చాలా సార్లు నరేంద్ర మోడీని ఘాటైన పదజాలంలో విమర్శిస్తూ వచ్చారు లేటెస్ట్ గా స్వామి ఒక హీటెక్కించే కామెంట్ చేశారు.
తన ట్విట్టర్ ద్వారా ఆయన వేసిన ఈ ట్వీట్ ఇపుడు దేశంలోనూ బీజేపీలోనూ చర్చకు తావిస్తోంది. ఇంతకీ స్వామి ఏమన్నారు అంటే ఆర్ధిక శాస్త్రంలో మోడీ నిరక్షరాస్యుడు అని. ఆయనకు ఏమీ తెలియదు. దేశాన్ని ఆర్ధికంగా ముందుకు ఎలా నడపాలో కూడా అవగాహన లేదు అని విమర్శించారు. ఇక ఆర్ధిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ కి కూడా ఆర్ధికంగా దేశం బలోపేతం కావాలంటే ఏమి చేయాలో తెలియదు అందుకే ఈ దేశం ఇలా ఉంది అని ఆయన విమర్శించారు.
అంతే కాదు భారతదేశంలో ప్రతీ ఏటా జీడీపీ 10 పది శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. అంత గొప్పగా దేశాన్ని తీర్చిదిద్దవచు. అలాగే, కేవలం పదేళ్లలోనే నిరుద్యోగాన్ని పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలించవచ్చు అని స్వామి అభిప్రాయపడ్డారు. కానీ దేశాన్ని ఏలే మోడీకి కేంద్ర మంత్రికి ఏమీ తెలియకపోవడం వల్లనె ఈ తిప్పలు అన్న అర్ధం వచ్చేటట్లుగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.
సుబ్రమణ్య స్వామి ఈ రకంగా మోడీని పట్టుకుని ఏమె తెలియదు అనడం పట్ల బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. నిరక్షరాస్యుడు అని ఒక పెద్ద మాట కూడా స్వామి వాడేశారు. ఇంకో వైపు చూస్తే స్వామి మాత్రమే కాదు చాలా మంది ఆర్ధిక నిపుణులు కూడా దేశాన్ని సక్రమంగా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నడపడం లేదు అని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు అతి పెద్ద పొరపాటుగా కూడా నిపుణులు చెబుతూ ఉంటారు.
అదే విధంగా దేశంలో చూస్తే ఏడేళ్ళకు పైగా చలామణీలో ఉన్న రెండు వేల రూపాయల నోట్లను ఇపుడు సడెన్ గా వాపస్ తీసుకోవడం ఏ రకమైన చర్య అని కూడా అంటూంటారు. ఈ దేశం ఆర్ధిక గమనం నిలిచిపోవడానికి సరైన చర్యలు కేంద్రం తీసుకోకపోవడమే కారణం అని చెబుతూంటారు. ఇపుడు స్వామి కూడా అదే మాట అంటున్నారు. ఎన్నో వనరులు మానవ సంపద పుష్కలంగా ఉన్న దేశంలో జీడీపీ రేటు పది శాతం లోపే నమోదు అవుతోంది. అది కూడా ఎప్పటికపుడు మారుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో గట్టి నిర్ణయాలు తీసుకునే ఆర్ధిక మంత్రి ఉండాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది.
నిర్మలా సీతారామన్ కంటే ముందు దివంగత అరుణ్ జైట్లీ ఈ శాఖను చూసేవారు. వాస్తవానికి ఆయన న్యాయశాస్త్రంలో నిపుణుడు. ఆయనను తెచ్చి ఈ శాఖ ఇచ్చారు ఇపుడు నిర్మలకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఆమెను స్వేచ్చగా పనిచేయనిస్తున్నారా అన్న డౌట్లు అయితే ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే మోడీ తొమ్మిదేళ్ల పాలనలో ఆర్ధిక రంగం మాత్రం బాగానే ఆటుపోట్లకు గురి అయింది అని అంటున్నారు.
ఇతర రంగాలలో మోడీ ప్రభుత్వం కొన్ని విజయాలను నమోదు చేసి ఉండవచ్చు కాక కానీ ఆర్ధిక రంగంలో మాత్రం ఇబ్బందులు తలెత్తుతున్నాయని అంతా అంటున్నారు. మాజీ ప్రధాని ఆర్ధిక నిపుణుడు మన్మోహన్ సింగ్ కూడా మోడీ ప్రభుత్వం ఆర్ధిక రంగంలో తీసుకుంటున్న చర్యలను ఎప్పటికపుడు తప్పులు పడుతూనే ఉన్నారు. ఇపుడు ఏకంగా స్వామి బీజేపీలోనే ఈ రోజుకీ టెక్నికల్ గా ఉన్న పెద్దాయన పట్టుకుని సంచలన కామెంట్స్ చేశారు. మరి దీని మీద ఎలాంటి రాజకీయ రాద్ధాంతం చెలరేగుతుందో చూడాల్సి ఉంది.