Begin typing your search above and press return to search.
శతృఘ్న మాట!... మోదీ యాక్షన్ హీరో!
By: Tupaki Desk | 15 Oct 2017 5:31 PM GMTబీజేపీ సీనియర్ నేత, ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా ఇటీవల కాలంలో సొంత పార్టీపై విమర్శల జల్లు కురిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ.. కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలను శతృఘ్న సిన్హా గట్టిగా సమర్ధించారు. దీంతో స్వపక్షంలోని విపక్ష నేతలతో ఈయన కూడా చేతులు కలిపాడంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనికితోడు మోదీ పాల్గొంటున్న కార్యక్రమాలకు శతృఘ్న గైర్హాజరయ్యేవారు దీంతో నిజంగానే ఈయన బీజేపీకి కంట్లో నలుసుగా మారారని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా శతృఘ్న చేసిన కామెంట్లు అందరినీ ఆకర్షించాయి. ఆయనలో మోదీపై ఇంత ప్రేమ ఉందాఅని అనిపించాయి. ఇంతకీ శతృఘ్న ఏమన్నారంటే..
శనివారం జరిగిన పాట్నాయూనివర్సిటీ కార్యక్రమానికి తాను హాజరుకాకున్నా దేశంలో అతిపెద్ద యాక్షన్ హీరో వెంట తానెప్పుడూ ఉంటానని పేర్కొన్నారు. తాను బీజేపీని వీడుతానన్న ప్రచారం అవాస్తవమని తోసిపుచ్చారు. తానెప్పుడు మోదీ వెంటే ఉంటానని, చివరి నిమిషంలో తనకు పాట్నా వర్సిటీ కార్యక్రమం గురించి ఆహ్వానం అందడంతో హాజరుకాలేక పోయానని వివరణ ఇచ్చారు. తాను ఆ కార్యక్రమానికి హాజరైనా, కాకున్నా ప్రధాని మోదీ, బీహార్ సీఎం నితీష్‌ను ఒకే వేదికపై చూడాలన్న తన కోరిక నెరవేరిందని అన్నారు.
వీరిద్దరి అనుబంధం దీర్ఘకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న శత్రుఘ్న సిన్హా పలు సందర్భాల్లో పార్టీ వైఖరికి భిన్నంగా స్పందించారు. మోదీ ఆర్థిక విధానాలను విమర్శించిన సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను శత్రుఘ్న సిన్హా గట్టిగా సమర్ధించారు. దీనికితోడు ప్రతిష్టాత్మక పాట్నా యూనివర్సిటీ వేడుకలకు ఆయన గైర్హాజరవడంతో సిన్హా పార్టీ వీడుతారనే ప్రచారం సాగింది. ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ శత్రుఘ్న సిన్హా ప్రధాని మోదీని ప్రశంసల్లో ముంచెత్తడంతో బీజేపీ స్థానిక నేతలు పండగ చేసుకుంటున్నారు.