Begin typing your search above and press return to search.
సిద్ధరామయ్య బలం ఏంటి? శివకుమార్ బలహీనతలు ఏంటి?
By: Tupaki Desk | 14 May 2023 11:00 AM GMTకర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. తిరుగులేని అధిక్యతను ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కన్ఫర్మ్ అయిపోయింది. మరి.. కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అన్న దగ్గరే ఇప్పుడు సీన్ ఆగింది. ముఖ్యమంత్రి కుర్చీ కోసం మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య.. కర్ణాటక కాంగ్రెస్ రథసారధి డీకే శివకుమార్ లు బరిలో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరిని అయితే అధినాయకత్వం డిసైడ్ చేస్తుందో వారే తదుపరి ముఖ్యమంత్రి అవుతారు. ఇలాంటి వేళ.. సిద్ధరామయ్య బలం ఏమిటి? బలహీనత ఏమిటి? శివకుమార్ బలం ఎంత? బలహీనతలు ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి బలాబలాలను అసెస్ చేస్తే..
నేపథ్యాలు : సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్
సిద్దరామయ్య
- అపారమైన అభిమానులు ఉన్న నేతల్లో ప్రముఖుడు. బలహీన వర్గాలకు అండగా ఉండేందుకు ఇష్టపడి జనతా పరివార్ నుంచి 2006లో కాంగ్రెస్ కు వచ్చేశారు. లేటుగా వచ్చినా లేటేస్టుగా కాంగ్రెస్ భావజాలాన్ని అర్థం చేసుకున్నారు.
- జనతాదళ్ లో ఉప ముఖ్యమంత్రిగా.. ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన ఇప్పటివరకు అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత ఆయన సొంతం. ఇప్పటివరకు ఆయన 13 సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
- 2013లో కాంగ్రెస్ కు 122 స్థానాల విజయాన్ని అందించటంలో కీలకభూమిక పోషించారు. అధిష్టానం విశ్వాసాన్ని వమ్ము చేయని నేత. రాష్ట్రంలో ఏ పార్టీ ఇవ్వనన్ని పథకాల్ని అమలు చేశారు.
డీకే శివకుమార్
- 27 ఏళ్లకే ఎమ్మెల్యేగా అయిన డీకే.. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ ఓటమి అన్నది చూసింది లేదు. తాజా ఎన్నికల్లో 1.2 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 62 ఏళ్ల వయసున్న ఇతన్ను ‘కనకపుర బండ’గా ఆయన్ను అభిమానించే వారు అభిర్ణిస్తుంటారు.
- కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ చెప్పే ఇతను 2017 వరకు సాదాసీదా నాయకుడే. సోనియాకు కళ్లు చెవులుగా చెప్పే.. ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ను 2017లో రాజ్యసభ సభ్యుడిగా గెలిపించేందుకు అవసరమైన ఎమ్మెల్యేకు బెంగళూరులో విడిది ఏర్పాటు చేయటం ద్వారా అధినాయకత్వం కంట్లో పడ్డారు.
బలాలు: సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్
సిద్దరామయ్య
- ముఖ్యమంత్రిగా వ్యవహరించినప్పటికీ అవినీతి ఆరోపణలు తక్కువ.
- సీనియర్ నేతగా.. అందరిని కలుపుకునే వ్యక్తిగా పేరు
- రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మీద పట్టు
- అపార రాజకీయ అనుభవం.
- పార్టీని ఒంటి చేత్తో నడిపే సత్తా. అధిష్ఠానం నిర్ణయం ఏదైనా ఓకే చెబుతారు.
- ఇదే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించటం
డీకే శివకుమార్
- యువ నాయకత్వానికి ప్రతినిధి
- పార్టీకి ట్రబుల్ షూటర్
- గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాసపాత్రుడు
- పార్టీకి అవసరమైన వేళలో అవసరమైనంత ఆర్థిక వనరుల్ని అందించటం
బలహీనతలు: సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్
సిద్దరామయ్య
- అధిష్ఠానం నుంచి పెద్దగా లేని సహకారం
- కొత్తతరం నేతలకు సూట్ కాని తీరు
- సమకాలీన రాజకీయాలు..వ్యూహాలను అర్థం చేసుకోలేనితనం
డీకే శివకుమార్
- బెంగళూరు మహానగరానికే పరిమితం కావటం
- ముక్కు మీద కోపం
- కొందరితోనే తప్పించి.. అందరితో కలవలేనితనం
- సీనియర్ల సహకారం లేకపోవటం