Begin typing your search above and press return to search.
ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలు
By: Tupaki Desk | 17 April 2023 4:00 PM GMTకుక్కలు.. ఎంతో నమ్మకమైన జంతువుగా మనిషికి అండగా ఉంటోంది. కానీ అవి మాంసాహారులే.. ఆకలిస్తే మనుషులను లాగేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో ఒక చిన్న పిల్లాడిని చంపి తినేశాయి. ఏ కుక్క అయినా అంతే అని చాలా ఘటనలు రుజువు చేస్తున్నాయి. చిన్న పిల్లలనే కాదు.. పెద్ద వారు కూడా ఈ కుక్కల దాడి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో 65 ఏళ్ల ఓ వ్యక్తి కుక్కల దాడిలో మృత్యువాతపడ్డాడు. అతడి నుంచి తప్పించుకునే వీలుంది కానీ.. కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసి అతి క్రూరంగా ఆ వ్యక్తిని చంపేశాయి.
ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఈ ఉదయం జాగింగ్ కు డాక్టర్ సఫ్ధర్ అలీ వచ్చారు. పార్క్ లో నిలబడి ఉండగా.. అంతలో ఓ కుక్క అతడివైపు వచ్చింది. దాన్ని అదిలించడంతో మరో కుక్క వచ్చింది.
ఆ రెండింటిని తప్పించుకునే సమయంలో మరిన్ని కుక్కలు వచ్చి దాడి చేశాయి. చూస్తుండగానే కుక్కల గుంపు ఆయనను చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచాయి. రాబందులు పీక్కు తిన్నట్టుగా కొరికేసి తినేశాయి. తీవ్ర రక్తస్రావంతో సఫ్దర్ అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.
ఉదయం 7.30 గంటలకు పార్క్ లో మృతదేహం గుర్తించారు సిబ్బంది. ఏం జరిగిందో అర్తం కాలేదు. హత్య అని అందరూ అనుకున్నారు. కానీ చివరకు సీసీ కెమెరాల ఫుటేజీ చూడడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ సఫ్ధర్ అలీపై కుక్కల దాడి భయానకంగా ఉంది. ఉదయం 6.30కి ఈ దాడి జరిగింది.
ఇప్పటికే యూపీలోని ఘజియాబాద్లో ఓ మూడు జాతుల కుక్కలు పెంచుకోవడాన్ని నిషేధించారు. పిట్ బుల్, రోట్ వీలర్, డోగో అర్జెంటీనా జాతి కుక్కలపై నిషేధం ఉంది. ఇవి మనుషులపై దాడి చేసేంత పెద్దగా ఉండడంతో వీటిని ఇక్కడ నిషేధించారు.
అయితే పార్క్ లో వృద్ధుడిని చంపింది మాత్రం వీధికుక్కలే కారణం. ఇప్పుడా ఆ భయానక వీడియో అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఇంతటి ఘోరాలు జరుగుతున్నా వీధి కుక్కలను నియంత్రించడంలో వాటి సంతతి పెరగకుండా చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంపై సామాన్యులు నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది.