Begin typing your search above and press return to search.
ఆ గ్రామంలో వీధి కుక్కలు కోటీశ్వరులు!
By: Tupaki Desk | 2 July 2023 4:00 PM GMTసాధారణంగా పెంపుడు కుక్కల బ్రతుకు ధర్జాగా ఉంటుందని అంటుంటారు.. అలాంటి సంఘటనలు బోలెడు కనిపిస్తుంటాయి కూడా. యజమానితో పాటు ఏసీ కారులో లగ్జరీగా బ్రతుకుతూ, స్పెషల్ బెడ్, స్పెషల్ ఫుడ్, స్పెషల్ హాస్పటల్, స్పెషల్ డే కేర్... ఇలా సాగుతుంటుంది కొన్ని పెంపుడు కుక్కల జీవితం. అయితే అంతకు మించి అన్నట్లుగా ఉంది గుజరాత్ లోని వీధి కుక్కల వ్యవహారం.
అవును... ఇకపై ఎవరైనా తన పరిస్థితి బాగోకపోతే... "నా బ్రతుకు మరీ వీధికుక్క బ్రతుకైపోయింది" అని అనేముందు కాస్త వెనకా ముందూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీధి కుక్కలు కోటీశ్వరులు.
వివరాళ్లోకి వెళ్తే... గుజరాత్ లోని పంచోత్ గ్రామానికి చెందిన కుక్కలు కోట్లకు అధిపతులుగా ఉన్నాయి. కారణం ప్రస్తుతం వాటి పేర ఏకంగా 90 కోట్లకు పైగా ఆస్తులున్నాయి. తాజాగా వాటి నిర్వహణకు ఉన్న ట్రస్ట్ వాటి పట్ల తీసుకునే కేరింగ్ తో ఈ వీధి శునకాల జీవితమే మారిపోయింది. ఇక, ఈ వీధి కుక్కలు అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ చూస్తే... పెంపుడు కుక్కలతోపాటు సామాన్య ప్రజానికం కూడా అసూయ పాడాల్సిందే అని చెప్పినా అతిశయోక్తి కాదేమో!
దీనివెనకున్న కథ ఏమిటంటే... గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా జిల్లాలోని పంచోత్ గ్రామ ప్రజలు.. జంతువులకు సేవ చేస్తే తమకు మంచి జరుగుతుందని బలంగా నమ్ముతారంట. దీంతో, వీధి కుక్కలను బాగా చూసుకోవాలని, వాటికి కూడా సేవచేయాలని నిర్ణయించుకున్నారంట. అంటే... జంతు సేవే దైవ సేవ అన్నట్లు అన్నమాట!
వెంటనే అనుకున్నదే తడువుగా అందరూ కలిసి వీధి కుక్కల కేరింగ్ కోసం ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి, తమ స్థాయికి తగినట్లుగా విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారట. ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు తమ కోట్ల విలువైన ఆస్తులను సైతం ట్రస్ట్ కు ఇచ్చేశారని చెబుతున్నారు. దీంతో ఈ ట్రస్ట్ ఫుల్ రిచ్ అయిపోయింది. దీంతో ఆ వీధి శునకాల లైఫ్ రాజభోగం అయిపోయింది.
ఇంకా స్పెషాలిటీ ఏమిటంటే... శునకాలకు ఆహారాన్ని తయారు చేసేందుకు, అందించేందుకు కొంతమంది వాలంటీర్ల టీం ఉందని చెబుతున్నారు. ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే స్పందించేందుకు ఒక వెటర్నరీ డాక్టర్ కూడా ఉన్నారట. దీంతో ఈ వీధి కుక్కలు అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.