Begin typing your search above and press return to search.

చేతుల క‌లుపుదాం.. ప్ర‌తిప‌క్ష పార్టీల వ్యూహం.. వైసీపికి చెక్!!

By:  Tupaki Desk   |   17 Oct 2022 11:30 PM GMT
చేతుల క‌లుపుదాం.. ప్ర‌తిప‌క్ష పార్టీల వ్యూహం.. వైసీపికి చెక్!!
X
బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము.. చ‌లిచీమ‌ల చేత‌జిక్కి చావ‌దె సుమతీ! అన్న‌ట్టుగా.. త‌మ‌కు 151 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుల ఉంద‌ని.. రాష్ట్రంలో 50 శాతం మంది ప్ర‌జ‌ల మాండేట్ ఉంద‌ని..చెప్పుకొనే వైసీపీకి.. చెక్ పెట్టేలా.. రాష్ట్రంలో రాజ‌కీయాలు మారుతున్నాయని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇప్ప‌టి వ‌ర‌కు.. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న‌ట్టుగా.. కార్య‌క్ర‌మాలుచేసి ప్ర‌భుత్వంపై క‌ద‌నం ప్ర‌ద‌ర్శించిన పార్టీలు.. ఇక నుంచి అన్నీ ఒక్క‌ట‌య్యేందుకు .. సంయుక్త సంగ్రామంలో వైసీపీని.. స‌మ‌సి పోయేలా చేసేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీ, బీజేపీ, క‌మ్యూనిస్టులు, ఇత‌ర పార్టీలు.. స‌హా.. జ‌న‌సేన వంటివి ఇప్ప‌టివ‌ర‌కు ఏపీ అధికార పార్టీపై ఎవ‌రికి వారే యుద్ధం ప్ర‌క‌టించారు. దేవాల యాల‌పై దాడులుజ‌రిగినా. ఎస్సీల‌పై నిర్బంధాలు జ‌రిగినా.. కేసినోవంటివి వెలుగు చూసినా.. ఏ పార్టీకి ఆ పార్టీనే ఉద్య‌మించింది. ఎక్క‌డా క‌లిసి గ‌ళం వినిపించే ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌లేదు. అయితే.. ఇప్పుడు అన్ని పార్టీల‌కు అండ‌గా ఉంటున్న.. న‌టుడిగానే కాకుండా.. త‌న సేవ‌ల ద్వారా ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతున్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌ను ప్ర‌భుత్వం నానా ఇబ్బందుల‌కు గురిచేసస్తున్నద‌నే వాద‌న వినిపిస్తోంది.

ఎందుకంటే.. రెండు రోజుల ప‌రిణామాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే.. జ‌న‌సేన‌ను తొక్కేసేలా వైసీపీ వ్యూహాలు ఉన్నాయ‌ని.. అన్నిపార్టీల నాయ‌కులు అభిప్రా య‌ప‌డుతున్నారు. ఏకంగా ప‌వ‌న్‌నే నిర్బంధించ‌డం.. హోట‌ల్‌కే ప‌రిమితం చేయ‌డం. క‌నీసం అభిమానుల‌నుద‌ర్శించేందుకు కూడా అవ‌కాశం లేకుండా చేయ‌డం వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ''ఇక‌, వేచి చూసి లాభం లేదు మిత్ర‌మా!'' అని పార్టీల‌నేత‌లు భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే సిద్ధాంతాలు.. రాద్ధాంతాల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని.. ఒకే మాట‌.. ఒకే బాట‌గా ముందుకు సాగాల‌ని ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే లా.. అడుగులు ప‌డుతున్నాయ‌ని తెలుస్తోంది.

వైసీపీయేత‌ర పార్టీల‌న్నీ.. త్వ‌ర‌లోనే తిరుప‌తి వేదిక‌గా.. స‌మావేశం ఏర్పాటు చేసుకుని.. కామ‌న్ అజెండాను రూపొందించుకుని.. ముందుకు సాగాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం విశాఖ‌లో నెల‌కొన్న వివాదం.. మ‌రోవైపు రాజ‌ధాని రైతులు చేస్తున్న పాద‌యాత్రకు అడ్డంకులు.. కీల‌క నేత‌ల‌ను అడ్డుకోవ‌డం.. వంటివి.. పార్టీలు సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోన‌నే అన్ని పార్టీలు చేతులు క‌ల‌ప‌డం ద్వారా.. మ‌ళ్లీ 2009లో ఉమ్మ‌డి ఏపీలో ఏర్ప‌డిన రాజ‌కీయ పరిస్థితిని తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.