Begin typing your search above and press return to search.

ఇప్పటివరకు వర్షం పడని వింత గ్రామం.. ఎక్కడో తెలుసా !

By:  Tupaki Desk   |   7 July 2021 11:29 AM GMT
ఇప్పటివరకు వర్షం పడని వింత గ్రామం.. ఎక్కడో తెలుసా !
X
ఈ భూ ప్రపంచం ఎన్నో అద్భుతాలకు పుట్టిల్లు. ఈ ప్రపంచంలో మనకి తెలియని ఎన్నో వింతలు, మరెన్నో విచిత్రాలు దాగున్నాయి. భూమి పై ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా వర్షం కురుస్తుంది. అదేంటి భూమి పై వర్షం కురుస్తుందా అని అడగడం ఏంటి పిచ్చి కాకపోతే, అని అనుకుంటున్నారా! నిజమే వర్షం ఇప్పటివరకు పడని ప్రాంతం కూడా ఇంకా ఉంది. వింత గ్రామం వర్షం పడని గ్రామంగా పేరు తెచ్చుకుంది. మేఘాలయాలోని మాసిన్రామ్ గ్రామం ప్రపంచంలో అత్యధిక వర్షాలు కురిసే గ్రామంగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ గ్రామానికి పూర్తి భిన్నమైన గ్రామం యుమెన్ రాజధాని సనాకు పశ్చిమాన ఉంది.

వర్షాలు పడని ఈ వింత గ్రామం పేరు ఆల్ హుతైబ్. భూ ఉపరితలానికి ఈ గ్రామం ఏకంగా 3,200 మీటర్ల ఎత్తులో ఉండటం గమనార్హం. వర్షం కురవని ఈ గ్రామానికి ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. శీతాకాలంలో ఇక్కడ ఉదయం సమయంలో వాతావరణం చల్లగా ఉన్నా సూర్యుడు ఉదయించిన తర్వాత మాత్రం వాతావరణం వేడెక్కుతుంది. వాతావరణం వేడిగా ఉంటుందని తెలిసినా పర్యాటకులు మాత్రం ఈ గ్రామానికి వస్తూనే ఉంటారు. పురాతన నిర్మాణాలతో పాటు ఆధునిక నిర్మాణాలు ఉండటం ఈ గ్రామం ప్రత్యేకత. ఈ గ్రామం మేఘాల కంటే పైన ఉండటం వల్ల ఈ గ్రామంలో ఎప్పటికీ వర్షం పడదు. అయితే ఈ గ్రామంపై నుంచి కిందన వర్షాలు పడటాన్ని మాత్రం చూడవచ్చు. ఎక్కడా చూడని ప్రత్యేకత ఉన్న ఈ గ్రామం పర్యాటకులకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ గ్రామం భూమికి 3200 మీటర్ల ఎత్తులో ఉన్న ఓ కొండపై ఉంది. దీని ప్రకారం మేఘాల కంటే ఎత్తులో ఆ గ్రామం ఉన్నదన్న మాట. మేఘాల కంటే ఎత్తులో ఉండటం వలన ఈ ప్రాంతంలో వర్షాలు కురవడం లేదు. అక్కడ వాతావరణ విషయానికొస్తే ఉదయం పూట ఎండ, రాత్రి సమయం చలిగా ఉంటుంది. అక్కడ నివసిస్తున్న ప్రజలకు కూడా ఆ వాతావరణం అలవాటే.