Begin typing your search above and press return to search.
ఈసారి కడపలో కాదు చిత్తూరు జిల్లాలో గొయ్యి
By: Tupaki Desk | 2 Dec 2015 9:46 AM GMTఈ మధ్య కాలంలో కడప జిల్లాలో భూమి కుంగిపోవటం తెలిసిందే. దాదాపుగా 20కు పైగా ప్రాంతాల్లో ఉన్నట్లుండి భూమి కుంగిపోవటం.. పెద్ద పెద్ద గోతులు ఏర్పడటం తెలిసిందే. ఈ గోతుల సైజు 40 అడుగులు వెడల్పు.. 40 అడుగుల లోతు వరకూ ఉండటం తెలిసిందే. ఇంత భారీ గోతులు పడటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఏర్పడుతున్నాయి
అయితే.. సమీపంలో రిజర్వాయరు ఉండటంతో పాటు.. భారీ వర్షాల కారణంగా ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని పలువురు చెబుతున్నా.. ప్రజల్లో మాత్రం భయం తగ్గటం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా కడప జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో ఇలాంటి భారీ గొయ్యి ఏర్పడింది. చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ కోట లోని ఒక ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ గొయ్యి ఏర్పడింది.
దాదాపు 10 అడుగులు లోతు.. 10 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ గొయ్యిలో ఒక సొరంగ మార్గం కనిపించటం విశేషం. ఇంతకాలం కప్పేసి ఉన్న ఈ సొరంగం.. తాజాగా ఏర్పడిన గొయ్యితో ఇది కనిపించింది. సొరంగమార్గం కారణంగానే భూమి కుంగి ఉంటుందని భావిస్తున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. ఎందుకిలా జరిగిందన్న విషయంపై అధికారుల మాట కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. వర్షం కారణంగా ఇలాంటి గొయ్యి ఏర్పడి ఉంటుందని అంచనా వేస్తున్నారు.