Begin typing your search above and press return to search.
లైవ్ లో న్యూస్ రీడర్ కు వింత అనుభవం..!
By: Tupaki Desk | 18 May 2021 12:30 AM GMTటీవీల్లో న్యూస్ రీడర్లు వార్తలు చదువుతున్నప్పుడు ఒక్కోసారి వింత పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాళ్లకు కొన్ని దారుణమైన ఘటనలు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఘటనలు కూడా జరగొచ్చు. కానీ అవేమీ పట్టించుకోకుండా యాంకర్లు వార్తలు చదవాలి. ప్రత్యేక పరిస్థితుల్లో కొందరు వాళ్లు భావోద్వేగానికి గురవుతుంటారు కూడా.. అయితే అమెరికాకు చెందిన ప్రముఖ న్యూస్ చానల్ ఫాక్స్ 9లో ఓ న్యూస్ రీడర్ కు వింత అనుభవం ఎదురైంది. ఓ టెక్నికల్ ఎర్రర్ ఆమెను కాసేపు కంగారు పెట్టింది. అయినా అలాగే ఆమె లైవ్ ను కొనసాగించారు.
చానల్ లో చిన్న సాంకేతిక సమస్య తలెత్తింది. టీవీ యాంకర్ మామూలుగా కాకుండా.. గ్రాఫిక్స్ లో వచ్చిన ఎర్రర్ వల్ల విచిత్రంగా పదిమందిగా కనిపిస్తుంది. సాధారణంగా మన తెలుగు టీవీ చానల్స్ అయితే వెంటనే లైవ్ ఆపేసి బ్రేక్ తీసుకుంటాయి. ఆ తర్వాత మళ్లీ లైవ్ ను కొనసాగిస్తాయి. కానీ ఈ అమెరికన్ చానల్ వినూత్నంగా వ్యవహరించింది. ఆ లైవ్ ను అలాగే కొనసాగించింది. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
ఫాక్స్ 9 న్యూస్ లో ఓ న్యూస్ రీడర్ వాతావరణం ఎలా ఉందో మ్యాప్ లో చూపిస్తూ .. ప్రేక్షకులకు వివరిస్తోంది. ఇంతలో వివిధ ప్రాంతాల్లోని ఉష్ణోగ్రతలు బ్లర్ అయ్యాయి. కానీ సరిగ్గా ఈ టైంలో ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చేసింది. దీంతో స్క్రీన్ మీద ఉన్న నంబర్లన్నీ పది సార్లు కనిపించాయి. న్యూస్ రీడర్ కూడా పదిసార్లు కనిపిస్తోంది.గ్రాఫిక్ ప్లేట్లు సెట్ చేయడంలో చిన్న తప్పు దొర్లడం వల్ల ఇటువంటి తప్పు జరిగి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ టీవీలైవ్ ను అలాగే కొనసాగించారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.