Begin typing your search above and press return to search.
స్ట్రెయిన్ వైరస్ :క్వారంటైన్ రూల్స్ మార్పు..లండన్ నుండి వచ్చిన ప్రయాణికులు ఆందోళన!
By: Tupaki Desk | 9 Jan 2021 5:30 AM GMTకరోనా మహమ్మారి జోరు ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కరోనా ఇలా భయపెడుతున్న సమయంలోనే బ్రిటన్ లో కొత్త కొరోనా స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చి ప్రపంచాన్ని మరింతగా భయపెడుతుంది. దీనితో గత కొన్ని రోజులుగా బ్రిటన్ కి రాకపోకలు రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా దాన్ని సవరించడంతో రాకపోకలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. అందులో భాగంగానే యూకె నుండి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కి వచ్చిన ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లో ఆందోళనకి దిగారు. లండన్ నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు 250 మందితో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకోగా.. కరోనా పరీక్షలు, క్వారంటైన్ నిబంధనల్లో చివరి నిమిషంలో జరిగిన మార్పుల వల్ల గందరగోళం ఏర్పడింది.
దీంతో ప్రయాణికులను విమానాశ్రయంలోనే శుక్రవారం అర్ధరాత్రి వరకు నిలిపివేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొత్త నియమాలు ప్రకటించిన కాసేపటికి ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. లండన్ నుంచి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను చేయించుకోవాలని, నెగెటివ్ వచ్చినా ఏడు రోజులు ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్ లోను, మరో వారం రోజులు హోం ఐసోలేషన్ లో ఉండాలని కేజ్రీవాల్ తెలిపారు. అలాగే, చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్నవారు కూడా అదనంగా ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను చేయించుకోవాలి, విమానాశ్రయంలో 10 గంటల వరకు గడపడానికి సిద్ధంగా ఉండాలి అని సూచించారు.
ఈ నిబంధనలపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి బయటకు వచ్చిన ఓ వీడియోలో పోలీసులు, విమానాశ్రయ అధికారులు ఉండే డెస్క్ చుట్టూ గుమిగూడిన ప్రయాణికులు అసహనం ప్రదర్శించారు. అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రయాణికుడు మేము ఇకపై ఈ నిర్బంధాన్ని ఎంత మాత్రం సహించబోం అన్నాడు. ఇక్కడ నుంచి బయటకు వెళ్లే హక్కు మాకు ఉంది అంటూ ఓ మహిళా ప్రయాణికురాలు మండిపడ్డారు. ఘర్షణ కొనసాగుతుండగా.. ప్రయాణికులపై డెస్క్ వద్ద ఉన్న ఓ మహిళా అధికారి అరవడం, చూపుడు వేలు చూపించి వార్నింగ్ ఇచ్చారు.
బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై జనవరి 31 వరకు నిషేధం పొడిగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరినా.. కేంద్రం స్పందించలేదు. దీంతో గందరగోళానికి కారణమైన తాజా నిబంధనలపై కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సవరించిన నిబంధనలను వెల్లడించారు. నిబంధనల్లో మార్పుల గురించి తమకు తెలియజేయలేదని ప్రయాణికులు అంటే.. ప్రీ-ఫ్లైట్ ప్రకటనలు చేశారని, కొత్త మార్గదర్శకాల కారణంగా 20 మంది ప్రయాణం రద్దుచేసుకున్నారని ఎయిరిండియా పేర్కొంది. ఇక ఆ విమానంలో వచ్చిన ప్రయాణికులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 222 మంది నెగెటివ్ గా వచ్చింది. మరో 32 మంది ఫలితాలు రావాల్సి ఉంది. ఇద్దరికి పాజిటివ్ రాగా, వారి నుంచి నమూనాలను సేకరించి జన్యు పరీక్షలకు పంపారు.