Begin typing your search above and press return to search.

గద్వాల్ విజయలక్ష్మికే మేయర్ పీఠాన్ని కట్టబెట్టడం వెనుక కథ ఇదీ

By:  Tupaki Desk   |   22 Feb 2021 3:30 PM GMT
గద్వాల్ విజయలక్ష్మికే మేయర్ పీఠాన్ని కట్టబెట్టడం వెనుక కథ ఇదీ
X
ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠం నాటకీయ పరిణామాల మధ్య గులాబీ పార్టీ సొంతమైంది. హంగ్ వచ్చిన వేళ అనూహ్యమైన పరిస్థితుల్లో టీఆర్ఎస్ సీనియర్ నేత కేకే కూతురు విజయలక్ష్మికి మేయర్ పీఠం దక్కింది. కేసీఆర్ తన ఉద్యమ సహచరుడి కూతురుకే పట్టం కట్టారు. ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయట..

ముందుగా టీఆర్ఎస్ మేయర్ రేసులో ప్రధానంగా భారతీనగర్ కార్పొరేటర్ సింధూ ఆదర్శరెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, అల్లపూర్ కార్పొరేటర్ సహిబా బేగం పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ అనూహ్యంగా కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మికి మేయర్ పీఠాన్ని కేసీఆర్ అప్పగించడం వెనుక ఏం జరిగిందనేది ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ ఆ హామీని నెరవేర్చేందుకే కేకే కూతురుకు మేయర్ పీఠం కట్టబెట్టినట్టు తెలుస్తోంది. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిన అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్‌ అవతరించింది. ఆ సమయంలో కేకే కూతురు విజయలక్ష్మికి మేయర్‌ పదవి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ విజయలక్ష్మిని మేయర్ చేసే ప్రయత్నాలు జరిగినా.. చివరి నిమిషంలో బొంతు రామ్మోహన్‌కు మేయర్ పదవి కట్టబెట్టారు. అందుకే ఇప్పుడు కేకే కూతురు విజయలక్ష్మిని మేయర్‌ చేసి గత హామీని సీఎం కేసీఆర్‌ నెరవేర్చినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందట.ఇక బీసీలకు టీఆర్ఎస్ సర్కార్ లో అన్యాయం జరుగుతోందన్న విమర్శలు ఈటల, బీజేపీ నేతల నుంచి రావడంతోనే కేసీఆర్ బీసీ అయిన కేకే కుమార్తెకు పట్టం కట్టినట్టు తెలుస్తోంది.