Begin typing your search above and press return to search.

సింఫుల్ గా సారీ చెప్పి..విజేతను మార్చేశారు

By:  Tupaki Desk   |   21 Dec 2015 10:10 AM GMT
సింఫుల్ గా సారీ చెప్పి..విజేతను మార్చేశారు
X
ప్రతిష్ఠాత్మక పోటీలు జరుగుతున్నప్పుడు.. తుది ఫలితం మీద ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక.. మిస్ వరల్డ్.. మిస్ యూనివర్స్ లాంటి పోటీల్లో విజేతల విషయంలో అయితే.. ఆసక్తి ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. మరి.. ఇంతటి ప్రతిష్ఠాత్మక పోటీల్లోని విజేతను ప్రకటించే విషయంలో దొర్లిన తప్పును చూసి విస్తుపోయే పరిస్థితి. ఆదివారం రాత్రి జరిగిన మిస్ యూనివర్స్ ఫైనల్ పోటీల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.

దశల వారీగా సాగు మిస్ యూనివర్స్ పోటీల్లో చివరగా ముగ్గురు ఫైనలిస్ట్ లు నిలిచారు. అమెరికా.. ఫిలిఫ్పైన్స్.. కొలంబియా దేశాలకు చెందిన భామలు కిరీటం కోసం నిలవగా.. మిస్ కొలంబియా విజేతగా నిలిచినట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో.. ఒక్కసారి ఉక్కిరి బిక్కిరి అయిన గుటిరేజ్ కు కరతాళ ధ్వనుల మధ్య కిరీటం అలంకరించారు. అంతలోనే చిన్నపాటి కలకలం చోటు చేసుకుంది. విజేతను ప్రకటించటంలో చిన్నపాటి తప్పు జరిగిందని.. తమను దయచేసి క్షమించాలంటూ కోరిన నిర్వాహకులు.. మిస్ యూనివర్స్ టైటిల్ ను మిస్ ఫిలిప్ఫైన్ అని ప్రకటించి షాకిచ్చారు.

ఇంత పెద్ద పోటీ విషయంలో విజేతను ప్రకటించే విషయంలో ఇంత నిర్లక్ష్యమా అన్న విమర్శలు ఒకపక్క.. మరోవైపు.. చేతికి వచ్చిన టైటిల్ తో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న మిస్ కొలంబియా పరిస్థితి అయితే.. మాటల్లో వర్ణించలేనంత ఇబ్బందికర పరిస్థికి నెత్తిన పెట్టిన కిరీటం క్షణాలు నిలవకుండానే.. వేరొకరికి వెళ్లిపోవటంపై ఆమె విస్తుపోయినప్పటికీ అంతలోనే సర్దుకొని హుందాగా వ్యవహరించి మనసుల్ని దోచుకుంది. మిస్ యూనివర్స్ లాంటి పోటీల్లో కూడా ఇలాంటి తప్పిదాలు జరుగుతాయా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.