Begin typing your search above and press return to search.
మగాళ్లు అలా అర నిమిషం కూడా ఆగలేరట
By: Tupaki Desk | 23 Jun 2016 10:30 PM GMTఒక ఆసక్తికర సర్వే ఫలితం ఒకటి బయటకు వచ్చింది. తాజాగా జరిపిన అధ్యయనంలో మగాళ్లు మరీ అంత ‘వీకా’ అన్నట్లుగా సర్వే ఫలితం ఉండటం గమనార్హం. ఇంతకీ అర నిమిషం కూడా ఆగలేనిది ఏ విషయంలో అన్న విషయానికి వస్తే.. డిజిటల్ ప్రపంచంలో శరీరంలో భాగంగా మారిన మొబైల్ గురించిన ముచ్చటగా చెబుతున్నారు. మగాళ్లను స్మార్ట్ ఫోన్లు నీడలా వెంటాడుతున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది.
జర్మనీలోని వుర్జ్ బర్గ్ వర్సిటీ.. బ్రిటన్ లోని నొట్టింగమ్.. ట్రెంట్ వర్సిటీకి చెందిన వారు తాజాగా ఒక అధ్యయనం చేపట్టారు. దీని ప్రకారం మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండే విషయంలో మగాళ్లు మరీ వీక్ గా ఉన్నట్లుగా తేల్చారు. స్మార్ట్ ఫోన్లకు మగాళ్లు మహా అయితే 21 సెకన్లు దూరంగా ఉండగలుగుతున్నారట. అదే ఆడాళ్లు మాత్రం 57 సెకన్ల పాటు మొబైల్ ఫోన్లే లేకున్నా ఓకే అంటున్నట్లుగా ఈ అధ్యయనం వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లు ఎంత ఎక్కువగా వినియోగిస్తే అంత ఒత్తిడికి గురి అవుతారన్న విషయాన్ని ఈ అధ్యయనం తేల్చటం గమనార్హం.