Begin typing your search above and press return to search.
ముఖ్యమంత్రి నరహంతకుడు.. లేపేస్తా! : పోలీసులకే ఫోన్
By: Tupaki Desk | 25 April 2023 2:48 PM GMTఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను లేపేస్తానంటూ.. ఓ వ్యక్తి నేరుగా పోలీసులకే ఫోన్ చేసి చెప్పడం.. సంచలనంగా మారింది. ఓ వ్యక్తి యూపీ పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ 112కు ఫోన్ చేసి.. ముఖ్యమంత్రి నరహంతకుడు..ఆయనను చంపందే నిద్రపోను.. అన్నం కూడా ముట్టను.. అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. దీంతో యూపీ వ్యాప్తంగా పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ ఫోన్ ఎక్కడ నుంచి వచ్చిందో కనుక్కునే పనిలో పడ్డారు.
మరోవైపు యూపీ సీఎం ఆదిత్యనాథ్ కు ప్రాణహాని ఉందని ఆ రాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ కూడా హెచ్చరించింది. ఇంతలోనే గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించడంతో పోలీసులు అలెర్ట్ అయి..కేసు నమోదు చేశారు. సాక్షాత్తూ సీఎం యోగి కి బెదిరింపుతో యూపీ యాంటీ టెర్రర్ స్క్వాడ్ అప్రమత్తమైంది. గుర్తు తెలియని కాలర్ యూపీ పోలీసుల సోషల్ మీడియా డెస్క్ కు కూడా మెసేజ్ చేశాడు.
"సీఎం యోగికో జల్దీ మార్ దుంగా. ఓ నియంత్ హో. బద్మాష్ సీఎం వో" (త్వరలో సీఎం యోగిని చంపుతా ను. అతనో నియంత.. బద్మాష్) అని తమకుచెప్పినట్టు యూపీ రాష్ట్ర పోలీసులు చెప్పారు. అయితే.. ఈ కాల్ ఎక్కడ నుంచి వచ్చిందనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు.
ఇదిలావుంటే.. ఈ కాల్ పై కేంద్ర హోం శాఖ కూడా అప్రమత్తమైంది. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను విశ్లేషించింది.
ఇటీవల గ్యాంగ్ స్టర్ సోదరులు.. అతిఖ్ అహ్మద్, ఆష్రఫ్ అహ్మద్ లను ముగ్గురు దుండగులు.. జర్నలిస్టుల ముసుగులో వచ్చి కాల్చి చంపారు. ఇది సంచలనంగా మారింది. పోలీసుల రక్షణలో ఉన్న ఇరువురుని కాల్చి చంపడం పై విమర్శలు కూడా వచ్చాయి.
ఇక, పాకిస్థాన్ కు చెందిన ఉగ్ర సంస్థలు కూడా బదులు తీర్చుకుంటామని.. ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వచ్చిన కాల్ దేశంలోదా.. విదేశాల నుంచి వచ్చిందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.