Begin typing your search above and press return to search.

రాహుల్ పెళ్లికి విలువైన బహుమతులు ఇచ్చిన స్టార్ క్రికెటర్లు..!

By:  Tupaki Desk   |   26 Jan 2023 10:09 AM GMT
రాహుల్ పెళ్లికి విలువైన బహుమతులు ఇచ్చిన స్టార్ క్రికెటర్లు..!
X
టీం ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి వివాహం జనవరి 23న అంగరంగ వైభవంగా జరిగింది. సునీల్ శెట్టికి చెందిన ఖండాల ఫామ్ హౌస్ లో అత్యంత సన్నీ తుల సమక్షంలో వీరి వివాహం జరిగిన సంగతి తెల్సిందే.

ఈ వేడుకల్లో సునీల్ శెట్టికి అత్యంత సన్నిహితంగా ఉండే షారుఖ్ ఖాన్.. సల్మాన్ ఖాన్‌లతోపాటు రాహుల్ తోటి ఆటగాళ్లు వరుణ్ ఆరోన్.. ఉమేశ్ యాదవ్‌లు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలకు సంబంధించిన పలు ఫొటోలను రాహుల్ అతియాలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

"నీ వెలుగులో.. ఎలా ప్రేమించాలో నేర్చుకుంటా.. ఈ రోజు మాకు అత్యంత విలువైన రోజు.. మాకెంతో ఇష్టమైన సన్నిహితుల మధ్య మేం ఒక్కటయ్యాం.. ఇది మా జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చింది.. మీ ప్రేమ, ఆశీర్వాదాలు మా ప్రయాణంలో తోడుగా ఉంటాయని కోరుకుంటున్నాం.." అంటూ వీరిద్దరు తమ వివాహ ఫోటోలు క్యాప్షన్ ఇచ్చారు.

ఈ వివాహం సందర్భంగా స్టార్ క్రికెటర్లు.. సినీ.. రాజకీయ ప్రముఖులు రాహుల్.. అతియా జంటలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాహానికి హాజరు కాలేకపోయినా మహేంద్ర సింగ్ ధోనీ తనకు ఎంతో ఇష్టమైన కవాసకి నింజా బైక్‌ను రాహుల్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడని వినికిడి. దీని విలువ రూ.80 లక్షలు ఉంటుందని సమాచారం.

అలాగే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ.2.17 కోట్లు విలువ చేసే బీఎండబ్ల్యూ లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడని టాక్. జాకీ ష్రాఫ్ 30 లక్షల విలువ చేసే వాచ్.. సల్మాన్ ఖాన్ 1.64 కోట్ల విలువైన ఆడి కారు.. అర్జున్ కపూర్ 1.5 కోట్ల విలువైన డైమండ్ బ్రాస్‌లెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు రాహుల్ మామ సునీల్ శెట్టి కట్నం కింద అతడికి ముంబైలోని రూ.50 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.