Begin typing your search above and press return to search.
జాతివివక్ష కేసు లో స్టార్ బక్స్ కు రూ.210కోట్ల ఫైన్.. అదెలానంటే?
By: Tupaki Desk | 16 Jun 2023 9:24 AM GMTరోటీన్ కు కాస్తంత భిన్నమైన వ్యవహారంగా చెప్పాలి. సాధారణంగా అమెరికా లో శ్వేతజాతీయుల పై సాఫ్ట్ కార్నర్.. నల్లజాతీయుల పై చిన్నచూపు ఉంటుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే పలు ఉదంతాలు వెలుగు చూస్తుంటాయి.
కానీ.. తాజా ఉదంతంలో మాత్రం బాధితురాలి శ్వేతజాతీయురాలు కావటం గమనార్హం. ప్రముఖ కాఫీ సంస్థ స్టార్ బక్స్ కు కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒక ఉద్యోగి ని జాతివివక్షతతో తొలగించిన వైనంలో రూ.210కోట్లు పరిహారం చెల్లించాలని పేర్కొంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.
2018లో ఫెలడెల్ఫియా లో స్టార్ బక్స్ స్టోర్ కు ఇద్దరు నల్లజాతీయులు వచ్చారు. వారి లో ఒకరు అక్కడి వాష్ రూమ్ ను వాడు కోవాలని అనుకున్నారు. స్టోర్ లో ఏమీ కొనని కారణంగా.. వారు వాష్ రూం ను వాడు కోవటానికి అక్కడి సిబ్బంది ఒప్పు కోలేదు. బిజినెస్ పని మీద ఒకరి కోసం తాము వెయిట్ చేస్తున్నట్లు చెప్పి.. అక్కడే కూర్చుండిపోయారు. బయట కు వెళ్లేందుకు ఒప్పుకోలేదు.
దీంతో.. స్టార్ బక్స్ సిబ్బంది పై పోలీసుల కు కంప్లైంట్ ఇచచారు. దీంతో.. రంగం లోకి దిగిన పోలీసులు వారిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు చానళ్ల లోనూ.. సోషల్ మీడియా లోనూ వైరల్ కావటం పై స్టార్ బక్స్ మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో.. దీన్ని చక్కదిద్దే క్రమం లో చర్యలు చేపట్టిన సంస్థ.. రీజినల్ మేనేజర్ షానన్ ఫిలిప్స్ ను జాబ్ నుంచి తొలగించింది.
అదే సమయంలో.. ఎక్కడైతే ఈ గొడవ జరిగిందో.. దానికి సంబంధించిన షాప్ మేనేజర్ ను మాత్రం జాబ్ తీయలేదు. ఇక్కడ రీజినల్ మేనేజర్ శ్వేతజాతీయురాలు కాగా.. గొడవ జరిగిన షాప్ మేనేజర్ నల్లజాతీయుడు. దీంతో.. తాను శ్వేతజాతీయురాలి ని కావటంతో జాతివివక్ష చూపించారంటూ సదరు ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు. 2019లో దాఖలైన ఈ కేసుకు సంబంధించిన విచారణ తాజాగా పూర్తైంది.
ఇరు వర్గాల వాదనలు విన్న న్యూజెర్సీ ఫెడరల్జ్యూరీ.. స్టార్ బక్స్ సంస్థ సదరు ఉద్యోగిని హక్కుల్ని ఉల్లంఘించినట్లుగా పేర్కొంటూ..జాతివివక్ష ను ప్రదర్శించటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆమెకు 25.6 మిలియన్ డాలర్లు.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.210కోట్లు పరిహారంగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది.