Begin typing your search above and press return to search.
మైదానంలోనే లోదుస్తులు మార్చుకున్న స్టార్ బ్యాట్స్ మెన్! అవాక్కయిన జనం!
By: Tupaki Desk | 1 Feb 2021 4:06 AM GMTఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో విచిత్ర సంఘటన జరిగింది. మైదానంలోనే బ్యాట్స్ మెన్ లో దుస్తులు మార్చు కోవడంతో జనం అంతా విస్తుపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియాలో ఐపీఎల్ జరుగుతున్నట్లే ఆస్ట్రేలియాలో పలు టీ 20 లీగ్ లు జరుగుతుంటాయి. ఈ లీగ్ లలో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్లు కూడా ఆడుతుంటారు. ప్రస్తుతం ఆ దేశంలో బిగ్ బాష్ లీగ్ జరుగుతోంది. ఆదివారం సిడ్నీ థాండర్, బ్రిస్బేన్ హీట్ మధ్య ఆదివారం నాకౌట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో సిడ్నీ ఓపెనర్, ఆస్ట్రేలియా జాతీయ జట్టు ఆటగాడు అయిన ఉస్మాన్ ఖావాజ మ్యాచ్ మధ్యలో మైదానంలోనే ప్యాంట్ విప్పి లో దుస్తులు మార్చుకున్నాడు. ఇది చూసిన స్టేడియంలోని ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఖావాజ ఏంటీ ఇలా ప్రవర్తించాడంటూ నోరెళ్లబెట్టారు.
అయితే ఖావాజ మైదానంలోనే లో దుస్తులు మార్చుకోవడానికి కారణం ఉంది.సిడ్నీ జట్టు ఇన్నింగ్స్ 9వ ఓవర్లో వికెట్ల మధ్య పరుగెత్తడానికి అసౌకర్యంగా ఫీలైన ఖావాజ అంపైర్ల అనుమతి తీసుకొని ఆటను నిలిపివేశాడు. తన లో దుస్తులను మార్చుకున్నాడు. ఉన్నట్టుండి మ్యాచ్ ఆగిపోవడంతో అసలేం జరుగుతుందో స్టేడియంలోని ప్రేక్షకులకు అర్థం కాలేదు. ఆ తర్వాత మైదానం మధ్యలోనే ఖావాజ లోదుస్తులు మార్చుకుంటూ కనిపించాడు. ఇది చూసి అంతా ఆశ్చర్య పోయారు. మైదానంలో వేలమంది జనం మధ్య మార్చుకోడం ఏంటీ అని నోరెళ్ల బెట్టారు.
ఈ మ్యాచ్ లో సిడ్నీ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు చేసింది. సామ్ బిల్లింగ్స్ (34), ఉస్మాన్ ఖావాజ (28) మాత్రమే రాణించారు. మిగతా బ్యాట్స్ మెన్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. అనంతరం ఛేదనలో బ్రిస్బేన్ జట్టు 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 169 చేసి విజయం సాధించింది. సామ్ హీజ్లేట్ (49బంతుల్లో 74 నాటౌట్), జిమ్మీ 23 బంతుల్లో 43), మార్నస్ లబుషేన్ (32) రాణించారు.