Begin typing your search above and press return to search.
ఆత్మ సాక్షి గ్రూప్ (SAS Group) సంచలన సర్వే : క్రిష్ణా జిల్లాలో మునిగేది ఏ పార్టీ...?
By: Tupaki Desk | 8 March 2023 11:18 AM GMTఉమ్మడి క్రిష్ణా జిల్లా రాజకీయంగా అత్యంత చైతన్యం కలిగిన ప్రాంతం. ఇక్కడ ఓటరు నిఖార్సు అయిన తీర్పు చెబుతాడు. అటూ ఇటూ చూడకుండా బెదరక తొణకక తీర్పు చెప్పే ఓటరుగా పేరుంది. క్రిష్ణా జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అంటారు. అలాంటి చోట 2019లో వైసీపీ జెండా పాతేసింది. మెజారిటీ సీట్లను గెలుచుకుంది. మరి ఈసారి ఆ హవా కొనసాగిస్తుందా అంటే ఆత్మ సాక్షి గ్రూప్ (ఎస్ ఏ ఎస్ గ్రూప్ ) సంచలన సర్వే పూర్తి గ్రౌండ్ రియాలిటీస్ ని వెల్లడిస్తోంది. దాని ప్రకారం చూస్తే వైసీపీకి ఈసారి రాజకీయ ఇబ్బందుకు తప్పవని పేర్కొంటోంది.
ఇక ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో చూస్తే మొత్తం పదహారు సీట్లు ఉన్నాయి. ఇందులో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచే సీట్లు ఎనిమిదిగా ఈ సర్వే తేల్చింది. దాని ప్రకారం చూస్తే విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, పెనమలూరు, మైలవరం, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడనగా సర్వే చెబుతోంది. వైసీపీ గెలిచే సీట్లు చూస్తే అయిదు ఉంటాయని సర్వే లెక్క చెబుతోంది అవి చూస్తే గన్నవరం, పామర్రు, గుడివాడ, తిరువూరు, నూజివీడుగా పేర్కొంటోంది.
అలాగే హోరా హోరీ పోరు చూస్తే విజయవాడ ఈస్ట్, కైకలూరు, నందిగామాగా ఉన్నాయి. ఇక ఇక్కడ ప్రస్తుతం మంత్రిగా ఉన్న జోగి రమేష్ పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఓడిపోతారు అని సర్వే చెబుఓంది. అక్కడ టీడీపీ జెండా ఎగరేస్తుందని అంటోంది. మైలవరంలో వసంత క్రిష్ణ ప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యే. ఆయన ఓడి దేవినేని ఉమా గెలుస్తారని సర్వే జాతకం చెబుతోంది. పెనమలూరు లో మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి ఓడతారని, మరో మాజీ మంత్రి మచిలీపట్నం నుంచి పేర్ని నాని ఓడిపోతారని సర్వే అంటోంది.
అలాగే జగ్గయ్యపేటలో వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఓడుతారని అలాగే, విజయవాడ సెంట్రల్ లో మల్లాది విష్ణు ఓటమి ఖాయమని, అవనిగడ్డలో వైసీపీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఓటమి ఖాయమని సర్వే తేల్చేసింది. ఇక వైసీపీ గెలిచే అయిదు సీట్లలో గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, గుడివాడ నుంచి కొడాలి నాని, పామర్రు నుంచి కైలా అనిల్ కుమార్, తిరువూరు నుంచి కె రక్షణ నిధి, నూజివీడు నుంచి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఉన్నారు.
హోరా హోరీ పోరులో ఉన్న సీట్లు చూస్తే కనుక విజయవాడ వెస్ట్ నుంచి మాజీ మంత్రి వైసీపీ కీలకనేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అలాగే కైకలూరు నుంచి వైసీపీ ఎమ్మ్మెల్యే దూలం నాగేశ్వరరావు, నందిగామ నుంచి మొండికోట జగన్ మోహనరావు ఉన్నారు. ఇలా వైసీపీ క్రిష్ణా జిల్లాలో చాలా సీట్లు టీడీపీకి క్రిష్ణార్పర్ణం అని సమర్పించబోతోంది అన్నది ఈ సర్వే నివేదిక.
వైసీపీ అధికారంలోకి వచ్చాక నలుగురు మంత్రులు అయ్యారు. అందులో కొడాలి నాని ఒక్కరే మరోసారి గెలిచే సీన్ ఉంది అని ఈ సర్వే చెబుతోంది. ప్రస్తుతం ఉన్న జోగి రమేష్ సహా మాజీ మంత్రులు మరో ఇద్దరు పరాజయం బాటలో ఉన్నారు అని సర్వే చెబుతోంది అంటే వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే లెక్క అని అంటున్నారు. మరి గ్రౌండ్ రియాల్టీ ఎలా ఉంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.