Begin typing your search above and press return to search.
పవన్ ఎఫెక్ట్.. తారీకులూ.. దస్తావేజులూ... బయటకు!
By: Tupaki Desk | 23 Jun 2023 11:00 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శల ఎఫెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిపై బాగానే పనిచేసినట్టు కనిపిస్తోంది. టీటీడీ 2018లో ప్రవేశ పెట్టిన శ్రీవాణి ట్రస్టు ద్వారా వసూలు చేస్తున్న మొత్తాలకు లెక్క, జమ ఉండడం లేదని.. కాకినాడ సభలో పవన్ ప్రకటించారు. అంతేకాదు.. ఈ నిధులు దారిమళ్లుతున్నాయని చెప్పారు. ఇది జరిగి నాలుగు రోజులు కూడా కాకుండానే టీటీడీ బోర్డు తారీకులు... దస్తావేజులతో సహా.. శ్రీవాణి ట్రస్టు వ్యవహారాలను బయటకు తీసింది. ప్రజల ముందు పెట్టింది.
+ శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పారదర్శకతని పాటిస్తున్నామని టీటీడీ పేర్కొంది. శ్రీవాణి ట్రస్టును ప్రారంభించిన తరువాత దళారీ వ్యవస్థను రూపుమాపామని... 70 మంది దళారులను అరెస్ట్ చేశామని... 214 కేసులు నమోదు చేశామని పేర్కొంది.
+ 2019 సెప్టెంబర్ 23 నుంచి శ్రీవాణి ట్రస్ట్‌కు విరాళాలు సమర్పించిన భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నామని తెలిపింది. ట్రస్టు ద్వారా ఇప్పటి వరకూ 860 కోట్లను దాతలు సమర్పించారని, 8,24,400 మంది భక్తులు శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శనం చేసుకున్నారని తెలిపింది.
+ శ్రీవాణి ట్రస్టు నిధులకు రసీదు ఇస్తున్నామని పేర్కొంది. ఈ భక్తులకు రాజమార్గం ద్వారా స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని తెలిపింది.
+ శ్రీవాణి ట్రస్టు నిధులు వివిధ బ్యాంకుల్లో రూ.602.60 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని.. సేవింగ్స్ ఖాతాలో రూ.139 కోట్ల నిధులు ఉన్నాయని, ఈ డిపాజిట్ల ద్వారా రూ.36.50 కోట్ల వడ్డీ వచ్చిందని టీటీడీ వెల్లడించింది. ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలకు గాను రూ.120.24 కోట్లు ఖర్చు చేశామంది.
కొసమెరుపు.. ప్రశ్నించేవాడు.. ఉండకపోతే.. ఇవన్నీ టీటీడీ వెల్లడించేదా? అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అది పవనైనా.. మరెవరైనా.. ధైర్యంగా ముందుకు వచ్చి ప్రశ్నించబట్టే.. తారీకులు, దస్తావేజులు బయట పెట్టారని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.