Begin typing your search above and press return to search.
తాజా సంచలనం శ్రీసైనీ రియల్ లైఫ్ తెలిస్తే అవాక్కే
By: Tupaki Desk | 6 Oct 2021 3:26 AM GMTఎవరీ శ్రీసైనీ? తాజా సంచలనం అంటున్నారు.. ఏం సాధించింది? లాంటి ప్రశ్నలు పేరు విన్నంతనే వస్తాయి. కానీ.. మిస్ వరల్డ్ అమెరికా కిరీటాన్ని సొంతం చేసుకున్న మనమ్మాయి అన్నంతనే.. ఒక్కసారిగా గుర్తుకు వస్తుంది. రెండురోజుల క్రితం ఈ ఘనతను సాధించిన శ్రీసైనీ రియల్ లైఫ్ ను చూసినప్పుడు.. రీల్ కథకు ఏ మాత్రం తీసిపోనన్న ట్విస్టులు కనిపిస్తాయి. ఆమె కాకుండా మరొకరు అయితే.. ఇంతటి విజయాన్ని సొంతం చేసుకోలేరేమో? తన కలను తీర్చుకోవటం కోసం ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా చేసుకొని పోరాడి గెలిచారు. ఆమె లైఫ్ ఒక స్ఫూర్తి.. ఇంతకీ ఆమె ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఈ టైటిల్ ను ఆమె ఎలా సొంతం చేసుకున్నారు? లాంటి ప్రశ్నలకు సమాదానాలు వెతికితే..
పంజాబ్ లో పుట్టిన శ్రీసైనీ.. ఆమెకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు వారి ఫ్యామిలీ అమెరికాకు వెళ్లింది. వాషింగ్టన్ లో స్థిరపడింది. బాల్యం ఉత్సాహంగా సాగుతున్న వేళలో.. పన్నెండేళ్ల చిరుప్రాయంలో ఆమెకు గుండెజబ్బు ఉందని తెలిసింది. మిగిలిన వారికి భిన్నంగా ఆమె గుండె నిమిషానికి 20 సార్లు కొట్టుకుంటుందన్న విషయాన్ని గుర్తించిన వైద్యులు పేస్ మేకర్ అవసరమన్నారు. అంతేకాదు.. ఆమెకు ఎంతో ఇష్టమైన డ్యాన్స్ కు గుడ్ బై చెప్పాలన్న సీరియస్ సూచన చేశారు.
కొన్నాళ్లు చికిత్స తీసుకున్న తర్వాత మళ్లీ తనకెంతో ఇష్టమైన డ్యాన్స్ ను షురూ చేసింది.చదువులోనూ వెనుకబడలేదు. తన ఆరోగ్య సమస్యను ఒక అడ్డుగా ఆమె భావించలేదు. ఆమెకు అందాల పోటీలో పాల్గొని రాణించాలన్నది చిన్నప్పటి నుంచి కల. అలాంటి వేళలోనే కాలం మరో సవాలును విసిరింది. ఒక కారు ప్రమాదంలో ఆమె ముఖం కాలిపోయి తీవ్ర ప్రమాదానికి గురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తన లక్ష్యాన్ని పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి.
వరుస చికిత్సలతోపాటు తల్లి నిరంతరం ఇచ్చిన కౌన్సెలింగ్ ఆమెను కుంగుబాటులో నుంచి బయటపడేలా చేయటమే కాదు.. తన అనారోగ్యం గురించి సరికొత్తగా ఆలోచించేలా చేసింది. స్కూల్లో ఉన్నప్పుడే హృద్రోగం, ఒత్తిడి వంటి అంశాలపై అందరికీ అవగాహన కలిగించటం మొదలు పెట్టింది. ఇదే అంశం మీద ఆమె రాసిన వ్యాసాలు పత్రికల్లో ప్రచురితం కావటమే కాదు.. చిన్న వయసులోనే 30 రాష్ట్రాలు.. ఎనిమిది దేశాల్లో ఆమె స్పీచులు ఇచ్చారు. ఆమె సేవలకు యనిసెఫ్ వారి అభినందనలు అందాయి.హార్వర్డ్ వర్సిటీ.. వాషింగ్టన్ వర్సిటీలో ఆమె కోర్సులు చేశారు.
ఇన్ని రంగాల్లో రాణిస్తూనే తనకెంతో ఇష్టమైన అందాల పోటీలోనే పాల్గొనే కసరత్తును ఆపలేదు. ఫలితంగా 2017లో మిస్ ఇండియా యూఎస్ఏగా.. 2018లో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ గా నిలిచారు. 2019లో మిస్ వరల్డ్ అమెరికాలో పోటీలో పాల్గొన్నప్పటికి.. గుండెపోటు రావటంతో వేదిక మీదనే కుప్పకూలిపోయారు. దీంతో ఆమె అనుకున్నట్లు టైటిల్ ను సొంతం చేసుకోలేకపోయారు. ఇలాంటి చేదు అనుభవం తర్వాత మామూలు వారైతే.. అందాల పోటీకి గుడ్ బై చెప్పేవారేమో?
కానీ.. శ్రీసైనీ అందుకు భిన్నం.. మరోసారి తీవ్రంగా శ్రమించారు. తాజాగా మిస్ వరల్డ్ అమెరికా పోటీలో నిలిచిన ఆమె.. తన ఐదేళ్ల ప్రయత్నాల్ని అధిగమించి ఎట్టకేలకు విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. తనకు ఎదురయ్యే ప్రతికూలతల్ని ఎదుర్కొని మరీ గెలుపును.. కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అందాల సంచలనంగా మారిన శ్రీసైనీ గురించి తెలిసిన వారే కాదు.. తెలుసుకుంటున్న వారు సైతం ఆ విజయానికి ఆమె సంపూర్ణ అర్హురాలుగా భావించటం విశేషం.