Begin typing your search above and press return to search.
హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములకు ఉపశమనం
By: Tupaki Desk | 4 March 2018 4:00 AM GMTఅమెరికాలో కొనసాగతున్న కీలక ఉత్కంఠకు తాత్కాలిక బ్రేక్ పడింది. హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములకు తాత్కాలిక ఊరట లభించింది. అమెరికాలో వీరి ఉద్యోగాల తొలగింపుపై ట్రంప్ ప్రభుత్వ నిర్ణయం ఆలస్యం కానుంది. దీంతో ప్రధానంగా భారతీయ కుటుంబాలకు కొంత ఉపశమనం దొరికినైట్లెంది. హెచ్-1బీ వీసాదారుల్లో భారతీయులు ఎక్కువన్న విషయం తెలిసిందే. హెచ్4 వీసా వినియోగదారుల (హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములు) పని అధికారం తొలగింపుపై ఇప్పుడే ఎటువంటి నిర్ణయం తీసుకోబోవడం లేదు అని కోర్టుకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) తెలియజేసింది. ఈ నిర్ణయం వల్ల కనిపించే ఆర్థికపరమైన ప్రభావంపై సమీక్షించి, జూన్‌కల్లా ఓ నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
2015 నుంచి గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న హెచ్-1బీ వీసాదారుల భాగస్వాముల (భార్య లేదా భర్త)కు హెచ్4 ఆధారిత వీసాలపై అమెరికాలో పని చేసుకునేందుకు గత ఒబామా ప్రభుత్వం అర్హత కల్పించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ట్రంప్ సర్కారు.. హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఈ హెచ్4 వ్యవహారంపైనా ఫిబ్రవరి 28కల్లా ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని డీహెచ్‌ఎస్ ప్రకటించింది. దీన్నిప్పుడు జూన్ వరకు వాయిదా వేయగా, హెచ్-1బీ వీసాదారుల భాగస్వాముల్లో నెలకొన్న ఆందోళన కొంత తగ్గినట్లు అయింది.