Begin typing your search above and press return to search.

నర్సుల దినోత్సవం: ఆ సేవామూర్తులకు వందనం

By:  Tupaki Desk   |   12 May 2021 9:30 AM GMT
నర్సుల దినోత్సవం: ఆ సేవామూర్తులకు వందనం
X
ఈ కరోనా కల్లోలంలో అయిన వారు దగ్గరకు రాకున్నా.. సొంత భార్య బిడ్డలే దూరంగా ఉంటున్నా.. ప్రాణాలు సైతం లెక్కచేయకుండా మనకు సేవ చేస్తున్న వారు కేవలం నర్సులు. నర్సులు నిజంగానే సేవామూర్తులు.. మనం ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి నయం అయ్యే వరకు వెన్నంటే ఉండే గొప్ప సేవా గుణం గల వారు వీరు.

*నర్సుల దినం నేపథ్యం
1820 మే 12న నర్సు వృత్తి ఆవిర్భావానికి , వృత్తి గౌరవానికి ప్రతిక అయిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజు. తొలి నర్సు అయిన ఆమె చేసిన త్యాగపూరితమైన కృషి ఫలితంగానే నేడు నర్సు వృత్తి కొనసాగుతోంది. ఆమె పుట్టినరోజున అంతర్జాతీయ నర్సు దినోత్సవంగా పేర్కొంటున్నారు.

అనుక్షణం నర్స్, సిస్టర్ అంటూ పిలిచినా విసుగు చెందకుండా ఎంతో ఓపికగా చేసే మాతృమూర్తులు వీరు. ప్రస్తుత సమయంలో కరోనాను కట్టడి చేసేందుకు అటు డాక్టర్స్ తోపాటు నర్సులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రస్తుతం కరోనా రోగులకు దగ్గరుండి మరీ సేవలు అందిస్తున్నారు.

కుటుంబాలకు దూరంగా ఉంటూ.. రోగులే తమ పిల్లలుగా భావిస్తూ ఆహోరాత్రులు శ్రమస్తున్న చల్లని దేవతలు ఈ నర్సులు. కరోనా బాధితులకు ఫ్లూయిడ్స్ అందించడం.. రెమిడెసివిర్ ఇంజక్షన్లు ఇవ్వడం.. ఆక్సిజన్ పెట్టడం వంటి అనేక సపర్యలు చేస్తున్నారు.

ఇప్పటికే కరోనా పోరులో చాలా మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. అయినా ఏమాత్రం అధైర్యపడకుండా.. కోవిడ్ బాధితులకు బాసటగా నిలుస్తున్నారు. ఇటు డాక్టర్లకు, అటు రోగులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉద్యోగం, వ్యక్తిగత జీవితానికి కుటుంబానికి దూరంగా కష్టకాలంలో సేవలందిస్తున్న ప్రతి ఒక్క నర్సుకు మనస్ఫూర్తిగా మా ‘తుపాకీ.కామ్’ తరుఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం.. మే 12న అంతర్జాతీయన నర్సుల దినోత్సం సందర్భంగా ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, ప్రముఖ నటుడు చిరంజీవి సైతం నర్సుల త్యాగాలను వేయినోళ్ల పొగిడారు.