Begin typing your search above and press return to search.
కేంద్రం చేత ఎన్నిసార్లు అదే మాట చెప్పిస్తారు...?
By: Tupaki Desk | 23 March 2022 2:30 AM GMTప్రత్యేక హోదా అన్నది సెంటిమెంట్ గా కూడా ఇపుడు ఉండదేమో. ఎందుకంటే ఎనిమిదేళ్ల విలువైన కాలం అలా కరగిపోయింది. అంతే కాదు, ఏపీ నుంచి దాని మీద పెద్దగా ఉద్యమాలు కూడా లేవు. మరో వైపు అందరూ ఆ బీజేపీ చుట్టూ తిరిగేవారే. సాగు చట్టాల మీద రైతులంతా కలసి విపక్షాల మద్దతుతో ఉద్యమించిన వేళ కూడా కేంద్రం బిర్రబిగుసుకుని ఏడాది పాటు కూర్చుంది.
ఆ తరువాత ఉత్తారాది ఎన్నికల కారణంగా వెనక్కి తగ్గిందని అంటారు. మరి అంతటి ఒత్తిడి పెడితేనే అన్నాళ్ళ టైం పట్టింది. చివరికి పొలిటికల్ ఈక్వేషన్స్ తో వ్యవహారం యూ టర్న్ తీసుకుంది. మరి అలాంటి రాజకీయ మ్యాజిక్ ప్రత్యేక హోదా విషయంలో ఏపీలో ఏ కోశానా లేదుగా. హోదా మీద పిల్లి మొగ్గలు వేసేవారే ఉన్నారుగా.
ఇక బీజేపీతో చెలిమి చేయడానికి అంతా ఉబలాటపడుతున్న వేళ హోదాని అధినాయకులు దాదాపుగా పెదవుల మీద నుంచి తుడిచేశారు అంటే కూడా అతిశయోక్తి కాదేమో. అయినా అపుడపుడు గుర్తుకు వచ్చినపుడు ప్రత్యేక హోదా అంటూ పార్లమెంట్ లో ఎంపీలు ప్రశ్నలు వేయడం దానికి యధా ప్రకారం కేంద్రం నుంచి జవాబులు రావడం షరా మామూలుగా సాగుతోంది.
గతంలో టీడీపీ ఎంపీ కింజరాపు రామోహననాయుడు హోదా మీద ప్రశ్న వేస్తే ఏం జవాబు వచ్చిందో ఇపుడు విశాఖ లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వేసిన ప్రశ్నకు అచ్చం అలాగే జవాబు వచ్చింది.
ఆ విధంగా ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి స్పష్టత ఇచ్చింది. అలా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదని కేంద్ర హోం శాఖ మరోసారి స్పష్టం చేసింది. వైసీపీ ఎంపీ సత్యనారాయణ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను సిఫారసు చేయలేదని చెప్పారు.
ఇక కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 32 నుంచి 42 శాతానికి పెంచామన్నారు. విభజన చట్టంలోని అనేక హామీలు నెరవేర్చామని నిత్యానందరాయ్ తెలిపారు.మొత్తానికి హోదా ముగిసిన అధ్యాయమని నిత్యానందరాయ్ సత్యాన్ని చక్కగా చెప్పేశారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది.
ఏపీ జనాలు హోదా విషయంలో గుండెల్లో రాయి పడేసుకుని అలా సాగిపోతున్నారు. హోదా రాదని, ఇచ్చే సీన్, తెచ్చే సీన్ కూడా ఎవరికీ లేదని అర్ధం చేసుకున్నారు. కానీ ఇలాంటి ప్రశ్నలను పదే పదే కేంద్రాన్ని అడిగి హోదా గురించి మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం, పాత మాటనే కేంద్ర పెద్దలు చెబుతూ ఏపీ జనాల గుండె బరువుని మరింతగా పెంచుతూ ఇలా చేయడం కంటే బాధాకరం మరోటి ఉండదన్నదే జన వేదన. దాన్ని కరెక్ట్ గా అర్ధం చేసుకుంటే హోదా అంశమే కాదు, ఈ ప్రశ్నలూ జవాబుల అంశం కూడా ముగిసిన అధ్యాయం అవుతుంది. మరి పదే పదే కెలక్కుండా ఉంటే బెటరేమో కదా.