Begin typing your search above and press return to search.

టైమ్ చూసి మరీ ప్రత్యేక హోదా ఇష్యూ... ?

By:  Tupaki Desk   |   14 Feb 2022 3:28 PM GMT
టైమ్ చూసి మరీ ప్రత్యేక హోదా ఇష్యూ... ?
X
రాజకీయాల్లో ఏ చిన్న సౌండ్ వచ్చినా దాని వెనక రిధం, కధనం వేరేగా ఉంటాయి. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఉన్నట్లుండి సడెన్ గా ప్రత్యేక హోదా ఏపీలో ఇష్యూ అయి కూర్చుంది. నిజానికి దాని మీద జనాలకు సీరియస్ నెస్ అన్నది బాగా తగ్గిపోయింది. టోటల్ గా తాము మోసపోయామని జనాలు భావిస్తున్న పరిస్థితి.

ఈ నేపధ్యంలో కేంద్ర హోం శాఖ నియమించిన త్రి సభ్య కమిటీలో ప్రత్యేక హోదా ఇష్యూ అలా మెరిసి మాయమైంది. అయితే రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీలో ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా ఇష్యూ ఎలా వస్తుంది అని బీఎజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లాజిక్ పాయింట్ తీస్తున్నారు.

మరో కమిటీ అది కూడా పూర్తిగా ఏపీకి సంబంధించినవే ఉండేలా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖను కోరుతున్నట్లుగా జీవీఎల్ చెప్పుకొచ్చారు. ఏపీ అధికారులతో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రత్యేకంగా చర్చించాలని జీవీఎల్ హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు ఈ మేరకు రాసిన లేఖలో ఆయన కోరారు. మొత్తానికి ప్రత్యేక హోదా విషయం మీద ఆయన క్లారిటీగా ఉన్నారు.

ప్రత్యేక హోదా అన్నది కేంద్రం మదిలో ఉందని చెప్పుకోవడానికే ఇలా చేశారు అన్న టాక్ మరో వైపు సాగుతోంది. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా విషయాన్ని బీజేపీ ఏపీ శాఖ వారు ఇక మీదట ఫుల్లుగా వాడుకుంటారు అని అంటున్నారు. అదెలా అంటే వైసీపీ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు నర్సాపురం లోక్ సభ సీటుకు త్వరలోనే రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది.

ఆయన తప్పనిసరిగా బీజేపీలోనే చేరి పోటీ చేస్తారు అంటున్నారు. అలా బీజేపీ జనసేన కలసి కూటమిగా ఆయన్ని నిలబెడతాయని చెబుతున్నారు. ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ ఆయుధంగా ప్రత్యేక హోదా మారబోతోంది అంటున్నారు.

ప్రత్యేక హోదాను ఏపీకి ఇస్తామని బీజేపీ పెద్దలు నాడు చెప్పుకుని ఎన్నికల గోదాలోకి దిగుతారని అంటున్నారు. అదే టైమ్ లో ఏపీకి ఎంతో చేస్తున్నామని, విభజన హామీలు నెరవేరుస్తున్నామని చెప్పుకోవడానికే ఈ కమిటీల పేరిట కసరత్తు అంతా అని కూడా అంటున్నారు. మరి రాజు గారిని ఈ రూపంలో బీజేపీ ఆదుకుంటే ఏపీలో అధికార వైసీపీ వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి.