Begin typing your search above and press return to search.

అమిత్ షాకు షాకిచ్చిన ప్రత్యేక కోర్టు

By:  Tupaki Desk   |   20 Feb 2021 4:51 AM GMT
అమిత్ షాకు షాకిచ్చిన ప్రత్యేక కోర్టు
X
కేంద్రహోంమంత్రి అమిత్ షాకు తాజాగా షాక్ తగిలింది. బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. కేంద్రహోంమంత్రికే కోర్టు సమన్లు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనమైంది.

2018 ఆగస్టు 28న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువునష్టం కేసులో ఈ మేరకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న వ్యక్తిగతంగా లేదా లాయర్ ద్వారా హాజరు కావాలని అమిత్ షాను కోర్టు ఆదేశించింది.

2018 ఆగస్టు 11న కోల్ కతాలో బీజేపీ నిర్వహించిన యువ స్వాభిమాన్ సభలో అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. అభిషేక్ బెనర్జీపై పలు ఆరోపణలు గుప్పించారు. నారద , శారద, రోజ్ వ్యాలీ, సిండికేట్ అవినీతి, మేనల్లుడి అవినీతి, మమతా బెనర్జీ వరుసగా అవినీతికి పాల్పడుతున్నారని అమిత్ షా అన్నారు.

‘కేంద్రం ఇచ్చిన రూ.3,59,000 కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఆ సొమ్మును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి, సిండికేట్ కు బహుమతిగా ఇచ్చారని’ నాడు అమిత్ షా ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ అవినీతి బలిపీటఠం దగ్గర ఈ సొమ్మును బలి ఇచ్చారని అమిత్ షా చెప్పినట్లు అభిషేక్ బెనర్జీ పిటీషన్ లో ఆరోపించారు. ఆ పిటీషన్ నేడు విచారణకు వచ్చి అమిత్ షా చిక్కుల్లో పడ్డారు.