Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : కరోనాతో పుట్‌బాల్ కోచ్ మృతి !
By: Tupaki Desk | 17 March 2020 12:11 PM GMTకరోనా వైరస్ సోకితే వయసు పైబడిన వారే చనిపోతున్నారని ఇప్పటివరకూ వైద్య నిపుణులు చెబుతూ వచ్చారు. కానీ ప్రాణాంతక కరోనా వైరస్ సోకడంతో పుట్ బాల్ టీమ్ 21 ఏళ్ల ఫ్రాన్సిస్కో గార్సియా అనే యువ కోచ్ మృతి చెందాడు. ఈ విషయాన్ని అథ్లెటికో పోర్టాడా ఆల్టా క్లబ్ వెల్లడించింది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. అలాగే, కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంది. అందులో భాగంగా స్పానిష్ ఫుట్ బాల్ లీగ్‌ను రెండువారాలపాటు వాయిదా వేసింది. దీంతో స్పెయిన్ లో విషాదం చోటుచేసుకుంది.
ఫ్రాన్సిస్కో గార్సియా ప్రస్తుతం మలాగ క్లబ్ కు చెందిన అథ్లెటికో పోర్టాడా అల్టా జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. శ్వాసతీసుకోవడంలో సమస్య ఉందని యువ కోచ్ గార్సియా ఇటీవల ఆసుపత్రిలో చేరాడు. గత కొంతకాలం నుంచి ల్యుకేమియా సమస్యతోనూ బాధపడుతున్న కోచ్ కు కరోనా వైరస్ నిరాదరణ పరీక్షలు కరోనా పాజిటీవ్ గా తేలింది. వైద్యులు మెరుగైన చికిత్సకు ప్రయత్నం చేసినప్పటికీ చికిత్స పొందుతూనేఆయన మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కోచ్ మృతిపై టీం మేనేజ్ మెంట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
కాగా కరోనా వైరస్ కారణంగా స్పెయిన్ లో ఇప్పటి వరకు 345 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం నాటికి ఆ దేశంలో వైరస్ కేసుల సంఖ్య పదివేలకు చేరుకుంది. వైరస్ కారణంగా మృతి చెందిన వారిలో అతి తక్కువ వయసు వ్యక్తి గార్కియా కావడం విచారకరం. మరోవైపు కరోనాను కట్టడి చేసేందుకు స్పెయిన్ ప్రభుత్వం ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలను చేపట్టింది.