Begin typing your search above and press return to search.
బస్సు ప్రమాదంపై ఎస్పీ అఫిషియల్ ప్రకటన
By: Tupaki Desk | 6 March 2017 4:36 AM GMTవిజయవాడ సమీపంలో ముళ్లపాడు వద్ద దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం వివరాలను కృష్ణా జిల్లా ఎస్పీ వెల్లడించారు. సవివరంగా ప్రమాదం తాలుకు సంఘనటలను చెప్పిన ఎస్పీ డ్రైవర్ తాగి ఉన్నారా లేదా అనే వివరాలను వెల్లడించలేదు. ఫిబ్రవరి 28న ఉదయం 5.30 గంటల సమయంలో ఒరిస్సా రాష్ట్రం కటక్ నుండి హైదరాబాద్ వెళుతున్న దివాకర్ ట్రావెల్స్ ఓల్వో బస్సు తీవ్ర ప్రమాదానికి గురైందని కృష్ణా జిల్లా ఎస్సీ తెలిపారు. ఆ సమయంలో బస్సులో ఉన్న సుమారు 50 మందిలో 10 మంది మృతి - 40 మందికి గాయాలు అయ్యాయని ఎస్పీ వివరించారు. మృతుల్లో బస్సు డ్రైవర్ - క్లీనర్ కూడా ఉన్నారని తెలిపారు. ఉదయం 6.30 గంటలకల్లా రెవెన్యూ - పోలీసు యంత్రాంగం సహాయ చర్యలు ప్రారంభించారని వివరించారు. గాయపడిన ఒక వ్యక్తి నందిగామ ఆస్పత్రికి తరలించగా ఉదయం 9 గంటలకు మృతి చెందారని అన్నారు. మృతుల సంఖ్యలను దృష్టిలో పెట్టుకొని పోస్టుమార్టమ్ చేయడానికి 8మంది ప్రత్యేకంగా నియమించారని వివరించారు
విలేకరుల సమావేశంలో ఎస్పీ చెప్పిన మరిన్ని వివరాలివి...
•మధ్యాహ్నం ఒంటి గంట కల్లా 8 మృతదేహాలకు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టమ్ మొదలు పెట్టారు
•మృతుల దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారున్నారు.
•దూర ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకుని పోస్టుమార్టమ్ అయిన వెంటనే మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో తరలించారు.
•4 మృతదేహాలను తరలించిన తరువాత హైదరాబాద్ కు చెందిన మొహమ్మద్ తయ్యబ్ మృతదేహాన్ని తరలిస్తుండగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు.
•వైసీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సందర్శనార్థం మృత దేహాన్ని నిలిపివేయాలని పార్టీ నాయకుల డిమాండ్ చేశారు.
• జిల్లా కలెక్టర్ - నేను ఎంతగా చెప్పినా వినపించుకోలేదు.
•మధ్యాహ్నం 3.30 గంటలకు నందిగామ ఆస్పత్రికి వచ్చి కలెక్టర్ తో 10 నిమిషాలు మాట్లాడి బస్సు పర్మిట్ వివరాలు కావాలని కోరారు.
• తొమ్మిది మృతదేహాల్లో 8 మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తయ్యింది, మిగిలినది డ్రైవర్ ది.
•ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అందరికంటే ఎక్కువ ఇంపాక్ట్ కు గురయ్యాడు.
•డ్రైవర్ పంచనామా కాపీ - శవ పరీక్ష నిర్వహించాల్సిందిగా డాక్టరుకు విజ్ఞాపన పత్రం పోలీసులు ఇచ్చారు.
• ఆ కాగితాలనే జగన్మోహన్ రెడ్డి డాక్టర్ చేతిలోంచి లాక్కున్నారు.
•అది పోస్టు మార్టం రిపోర్టు కాదని డాక్టర్ ఎంత బ్రతిమాలినా జగన్మోహన్ రెడ్డి వినిపించుకోలేదు.
•ప్రతిపక్ష నాయకుడినని, 3 కాపీల్లో ఒక కాపీ కూడా తనకివ్వరా అంటూ డాక్టరును గద్దించారు.
•మీడియా సమావేశం పోస్టుమార్టమ్ రూములో కాకుండా బయట నిర్వహించుకోవాలని వైసీపీ నాయకులకు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
•వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేయగా కలెక్టర్ మీద విరుచుకుపడ్డారు.
•డ్రైవర్ ఆదినారాయణ మృతదేహానికి పోస్టుమార్టం శాస్త్రీయంగా నిర్వహించాం.
•మద్యం మత్తులో ఉన్నాడో లేదో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపాం.
•లగేజీతో పాటు పడుకున్న రెండవ డ్రైవర్ ని విజయవాడ ఆస్పత్రికి తరలించాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/