Begin typing your search above and press return to search.
ఆ రైళ్లు స్పీడ్ గా కాదు.. స్లోగా నడుస్తాయంట
By: Tupaki Desk | 2 Sep 2015 4:29 AM GMTరోజురోజుకీ పెరుగుతున్న సాంకేతికతతో వేగం పెరిగిపోతుంటే అందుకు భిన్నంగా రైల్వే శాఖ మాత్రం నెమ్మది.. నెమ్మది అనటం విశేషం. జీవన శైలిలో వేగం పెరిగిపోయి.. ఇప్పుడు కాలానికి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి చోటు చేసుకుంది. ప్రతిఒక్కరూ సమయాన్ని వీలైనంతగా ఆదా చేయాలని.. మిగిలిన పనులపై ఫోకస్ చేయాలని భావిస్తున్న వైనం తెలిసిందే.
అయితే.. అందుకు భిన్నంగా.. ఇప్పటికి నడిచే రైళ్ల వేగాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవటం అధికారులకే చెల్లింది. రైళ్ల వేగాన్ని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రైళ్ల విషయంలో తీసుకున్న ఈ ‘‘నెమ్మది’’ నిర్ణయం కారణంగా పది నిమిషాల నుంచి 1.20గంటల పాటు ప్రయాణ సమయం పెరగనుండటం గమనార్హం.
సాంకేతికంగా ఉన్న సమస్యల కారణంగా రైళ్ల వేగాన్ని తగ్గిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. సవరించిన రైళ్ల వేగాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. పలు రైళ్ల వేగం తగ్గనున్నాయి.
= విశాఖ.. సికింద్రాబాద్ ల మధ్య నడిచే దురంతో సూపర్ ఫాస్ట్ రైలు ప్రయాణ సమయం అరగంటకు పెంచారు.
= మామూలుగానే తిరుమల ఎక్స్ ప్రెస్ (తిరుపతి.. విశాఖపట్నం) ప్రయాణమే బోర్ అనుకుంటే.. తాజాగా వేగాన్ని మరింత కుదించటంతో 20 నిమిషాల పాటు ప్రయాణం పెరగనుంది.
= చెన్నై.. కాకినాడ మధ్య నడిచే సర్కారు ఎక్స్ ప్రెస్ వేగం కూడా తగ్గనుంది. దీంతో.. అరగంట పాటు జర్నీ పెరగనుంది.
= నర్సాపూర్.. నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్ రైలు వేగాన్ని బాగా కుదించటంతో ప్రయాణ వేగం ఏకంగా 1.20గంటల పాటు పెరగనుంది.
= సికింద్రబాద్.. విశాఖల మధ్య నడిచే ఏసీ ఎక్స్ ప్రెస్ ను శుక్రవారం నుంచి శనివారం కు మార్చారు. అదే సమయంలో విశాఖ.. సికింద్రాబాద్ లకు ఆదివారం నుంచి శనివారానికి మార్చారు.