Begin typing your search above and press return to search.

దక్షిణాఫ్రికాలో మరో స్ట్రెయిన్​.. ఇది బ్రిటన్​ ‘వైరస్​’ కంటే డేంజర్​

By:  Tupaki Desk   |   24 Dec 2020 5:57 AM GMT
దక్షిణాఫ్రికాలో మరో  స్ట్రెయిన్​..  ఇది బ్రిటన్​ ‘వైరస్​’ కంటే డేంజర్​
X
కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. వ్యాక్సిన్​ వచ్చేస్తోంది. ఇక కరోనా మహమ్మారిని జయించినట్టే అని ప్రజలు ప్రభుత్వాలు భావిస్తున్న తరుణంలో బ్రిటన్​లో జన్యుమార్పిడి చెందిన కొత్త కరోనా వైరస్​ పుట్టుకొచ్చింది. ఇది తొలి కరోనా కంటే వేగంగా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు అంచనావేశారు. దీంతో వెంటనే బ్రిటన్​లోని అనేకప్రాంతాల్లో సంపూర్ణ లాక్​డౌన్​ విధించారు. మరోవైపు అనేకదేశాలు బ్రిటన్​కు వెళ్లే విమానాలను రద్దు చేశాయి. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాలో మరో కొత్త స్ట్రెయిన్​ పుట్టుకొచ్చిందట. ఇది బ్రిటన్​లో పుట్టిన వైరస్​ కంటే ఎంతో డేంజర్​ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో కేసులకు ఈ కొత్త స్ట్రెయినే కారణమని వైద్యులు భావిస్తున్నారు.

దక్షిణాఫ్రికాలో గుర్తించిన వైరస్​ను 501.V2 వేరియంట్ గా గుర్తించారు. చిన్నపిల్లలో ఈ వైరస్​ అధికంగా వ్యాపిస్తున్నట్టు సమాచారం. దక్షిణాఫ్రికా వేరియంట్ వైరస్.. అధిక వైరల్ లోడ్ కలిగి ఉందని చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో పుట్టిన వైరస్​ బ్రిటన్​లోని కొత్త వైరస్​ కంటే ఎంతో డేంజర్​ అని వైద్యులు అంటున్నారు. కొన్ని వారాల క్రితం దక్షిణాఫ్రికా నుంచి బ్రిటన్​కు వచ్చిన ప్రయాణికుల్లో ఇద్దరిలో కొత్త వేరియంట్ వైరస్ కేసులను గుర్తించారు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా నుంచి వస్తున్న విమానాలను ఆపేశారు. మరోవైపు లండన్​ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి ఎవరెవరకు వచ్చారని గుర్తించి.. వారందరినీ క్వారంటైన్​లో ఉంచుతున్నారు. దక్షిణాఫ్రికాతో వచ్చినవారితో పాటు వారు ఎవరెవరిని కలిశారో గుర్తించి వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.