Begin typing your search above and press return to search.
హక్ చెప్పిన ‘ఇండియా’ స్వీట్ మెమరీస్
By: Tupaki Desk | 8 March 2016 4:38 AM GMTభారత్.. పాక్ ల మధ్య ఎంత అనుబంధం ఉందో ప్రపంచ దేశాలన్నింటికి తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్యనున్న వైరం కారణంగా.. ఈ రెండు దేశాలకు సంబంధించి ఏ ఆట జరిగినా.. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక.. ఈ ఇరు దేశాల జట్ల మధ్య కానీ క్రికెట్ మ్యాచ్ అంటే మాత్రం భావోద్వేగాలు పీక్ స్టేజ్ కి టచ్ అవుతాయి. బయట ఎమోషన్స్ కు తగ్గట్లే మైదానంలోని ఆటగాళ్ల మధ్య కూడా అదేదో సీరియస్ కోట్లాట అన్నట్లే సాగే పరిస్థితి. మ్యాచ్ కు తగ్గట్లే రెండు దేశాల్లో ఎమోషన్స్ ను పీక్ స్టేజ్ కు టచ్ అవుతుంటాయి.
అయితే.. ఇదంతా నాణానికి ఒకవైపు అని.. మరోవైపు కూడా ఉందంటూ చెప్పుకొచ్చారు ఒకప్పటి పాక్ జట్టు కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గంగూలీతో కలిసి తన స్వీట్ మెమరీస్ ను పంచుకున్నాడు. ఈ సందర్భంగా 2004లో టీమిండియా జట్టు పాక్ లో పర్యటించిన వైనాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ పర్యటన సందర్భంగా భారత క్రికెటర్లు పాక్ లోని వివిధ ప్రాంతాలకు స్వేచ్ఛగా వెళ్లటమే కాదు.. చాలా ఎంజాయ్ చేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. పలు రెస్టారెంట్లకు టీమిండియా సభ్యులు వెళ్లేవారని.. వాళ్ల ఎవరి దగ్గరా పాక్ రెస్టారెంట్ల యజమానులు డబ్బులు తీసుకునే వారు కారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. టీమిండియా సభ్యులు షాపింగ్ కు వెళ్లాల్సి వస్తే.. వారికి తోడుగా పాక్ క్రికెట్ జట్టు సభ్యులు వెళ్లేవారని.. ఆ సందర్భంగా కూడా వారి దగ్గర నుంచి ఏ షాపు యజమాని కూడా టీమిండియా క్రికెటర్ల నుంచి డబ్బులు తీసుకునే వారు కాదని వెల్లడించారు. భారత్.. పాక్ ల మధ్య తరచూ క్రికెట్ మ్యాచ్ లు జరగాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన హక్.. మైదానంలోనే తప్ప.. విడిగా మాత్రం భారత్.. పాక్ ఆటగాళ్లు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారన్న విషయాన్ని చెప్పకనే చెప్పేయటమే కాదు.. తన మాటలతో హక్.. భారతీయుల మనసుల్ని దోచుకున్నాడని చెప్పక తప్పదు.