Begin typing your search above and press return to search.

న్యూయార్క్‌లో 'ర‌హ‌స్యాల' స‌మాధి

By:  Tupaki Desk   |   9 Jun 2017 11:08 AM GMT
న్యూయార్క్‌లో ర‌హ‌స్యాల స‌మాధి
X
మ‌నుషులు చ‌నిపోయాక వారిని స‌మాధి చేస్తారు. మ‌రి మ‌నిషి మెద‌డులోని ర‌హ‌స్యాల సంగ‌తేంటి? అవి ఆ మ‌నిషితో పాటే మ‌రుగున‌ప‌డి పోవాల్సిందేనా? ఎంత‌మాత్రం కాదు. ఇక‌పై మ‌నుషులు త‌మ ర‌హ‌స్యాల‌ను కూడా ఎంచ‌క్కా స‌మాధి చేయ‌వ‌చ్చు.

జీవితంలో ప్ర‌తి మనిషికి కొన్ని రహస్యాలుంటాయి. వాటిని ఎవ‌రితోనూ పంచుకోలేని ప‌రిస్థితులుంటాయి. కానీ, ఆ ర‌హ‌స్యాలు మ‌నుషుల‌ను చ‌చ్చే వ‌ర‌కు వెంటాడుతుంటాయి. వాటిని మ‌ర‌చిపోవ‌డం అంద‌రికీ సాధ్యం కాక‌పోవ‌చ్చు. అటువంటి రహస్యాలను సమాధి చేసి మాన‌సిక ప్రశాంతత పొంద‌వ‌చ్చంటోంది సోఫి కాలె అనే కళాకారిణి.

న్యూయార్క్‌ లోని బ్రూక్లిన్‌ గ్రీన్‌ వుడ్‌ శ్మశాన వాటికలో ఓ సమాధిని సోఫి ఏర్పాటు చేసింది. దానిపై ‘హియర్‌ లై ది సీక్రెట్స్‌ ఆఫ్‌ ది విజిటర్స్‌ ఆఫ్‌ గ్రీన్‌ వుడ్‌ సిమ్మెట్రీ’ అని రాసి ఉంటుంది. ఆ శ్మశానవాటికకు వ‌చ్చిన వారు త‌మ రహస్యాలను స‌మాధి చేయ‌వ‌చ్చు. ఆ శ్మశాన వాటికు వచ్చిన వారు త‌మ రహస్యాలను ఓ కాగితంపై రాసి సమాధి కింద ఉన్న చిన్న రంధ్రంలో వేయాలి.

కొన్ని రోజులు గ‌డిచాక‌ సోఫి ప్రజల ముందే బ‌హిరంగంగా ఆ కాగితాలను కాల్చేస్తుంది. సోఫికి త‌ట్టిన ఈ వినూత్న ఆలోచ‌న‌కు శ్మ‌శాన‌ వాటిక యాజమాన్యం.. స్థానిక స్వచ్ఛంద సంస్థ మ‌ద్ద‌తునిచ్చాయి. ఈ ర‌హ‌స్యాల స‌మాధిలో త‌మ ర‌హ‌స్యాల‌ను దాచ‌టానికి చాలా మంది ఆస‌క్తి చూపుతుండ‌డం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/