Begin typing your search above and press return to search.
ట్రేండింగ్ : సోను సూద్ - కేటీఆర్ ట్విట్టర్ సంభాషణ
By: Tupaki Desk | 1 Jun 2021 10:30 AM GMTప్రస్తుతం దేశంలో కరోనా కష్టకాలం నడుస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఎంతోమంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారానే బాధితులకు సహకారం అందించేందుకు ముందుకొస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రముఖ నటుడు సోనూసూద్ ను సూపర్ హీరో అంటూ ప్రశంసించారు. అయితే ఆ వెంటనే సోనూసూద్ కూడా కేటిఆర్ సార్ మీరే హీరో అంటూ ట్విట్టర్ లో బదులు ఇవ్వడంతో వీరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు విషయం ఏంటంటే.. నంద కిశోర్ తోకల అనే ఓ నెటిజన్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. "తాను సంప్రదించిన 10 గంటలలోపే తమకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చారని, ఆ మేలు ఎప్పటికీ మరిచిపోలేమని అన్నాడు. అదే విధంగా తెలంగాణ ప్రజల కోసం కూడా మీ సహకారం కొనసాగించడం అభినందించే విషయమని తెలిపి.. ఈ సందర్భంగా తాను చెప్పదలుచుకున్నది ఒక్కటే అంటూ.. నిజమైన సూపర్ హీరో కేటీఆర్" అని నందకిశోర్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ పై వెంటనే మంత్రి కేటీఆర్ స్పందించి.. "నేను ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడిగా తనకు చేతనైనంతా సహాయం చేస్తున్నాను. సూపర్ హీరో నేను కాదు. సూపర్ హీరో అని 'సోనూసూద్'ను పిలవచ్చు అని కేటీఆర్ రీట్వీట్ చేశారు.
అలాగే ట్వీట్ లో సోనూసూద్ ను కూడా మెన్షన్ చేసారు. అయితే కేటిఆర్ ట్వీట్ పై స్పందించిన సోనూసూద్.. "మీ మంచి హృదయానికి థాంక్స్. రియల్ హీరో నేను కాదు మీరే.. తెలంగాణ ప్రజల కోసం ఎంతో చేస్తున్నారు. మీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోంది. తెలంగాణను నా రెండో ఇల్లుగా నేను భావిస్తాను. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు నాపై ఎనలేని ప్రేమ, అభిమానం చూపిస్తున్నారు" అంటూ సోనూసూద్ ట్వీట్ చేశాడు. మళ్లీ ఆ వెంటనే కేటీఆర్ స్పందిస్తూ.. సోనూసూద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీరు చేస్తున్న గొప్ప పని లక్షలాది మందికి ఆదర్శమని కేటీఆర్ రీట్వీట్ చేశారు. ప్రస్తుతం వీరి ట్విట్టర్ సంభాషణ చూసి సామాన్యులు మీరిద్దరూ హీరోలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. సోనూసూద్ ఇటీవలే అల్లుడు అదుర్స్ అనే సినిమాలో నటించాడు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.