Begin typing your search above and press return to search.

సీఎం అభ్య‌ర్థిని సోనియా ప్ర‌క‌టించ‌నున్నారా?

By:  Tupaki Desk   |   23 Nov 2018 9:23 AM GMT
సీఎం అభ్య‌ర్థిని సోనియా ప్ర‌క‌టించ‌నున్నారా?
X
మేడ్చ‌ల్‌ లో నేడు జ‌ర‌గ‌నున్న భారీ బ‌హిరంగ స‌భ‌కు యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ హాజ‌రుకానున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నున్నారు. ఎన్నిక‌ల‌కు ఇంకో 15 రోజులు కూడా లేక‌పోవ‌డంతో సోనియా స‌భ‌పై టీపీసీసీ నేత‌లు భారీ ఆశ‌లు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ వైపుకు తిప్పేందుకు ఆమె రాక దోహ‌ద‌ప‌డుతుంద‌ని ఆశిస్తున్నారు.

తాజాగా ఈ స‌భ‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. మేడ్చ‌ల్ స‌భ‌లోనే కాంగ్రెస్‌ - టీడీపీ - తెలంగాణ జ‌న స‌మితి - సీపీఎంల‌తో కూడిన ప్ర‌జా కూట‌మి త‌ర‌ఫున సీఎం అభ్య‌ర్థిని సోనియా ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌స్తుతం ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ అభ్య‌ర్థి ఎంపిక‌లో తెలుగుదేశం పార్టీ అధినేత - ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కీల‌క పాత్ర పోషించార‌ని కూడా వార్త‌లొస్తున్నాయి.

తెలంగాణ తొలి ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ద‌ళితుణ్ని ముఖ్య‌మంత్రిగా చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చాక ఆ మాట‌ను విస్మ‌రించారు. స్వ‌యంగా తానే సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. దీంతో ద‌ళిత వ‌ర్గాల్లో కొంత అసంతృప్తి నెల‌కొంది. ఈ అసంతృప్తిని త‌మ‌కు అనుకూలత‌గా మార్చుకొని - ద‌ళితుల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకునేందుకు చంద్ర‌బాబు ప‌క్కా వ్యూహం పన్నార‌ని తెలుస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్ఠానంతో చ‌ర్చ‌లు జ‌రిపార‌ని - ద‌ళితుణ్ని ప్ర‌జా కూట‌మి సీఎం అభ్య‌ర్థిగా చేసేందుకు ఒప్పించార‌ని స‌మాచారం.

వాస్త‌వానికి సీఎం అభ్య‌ర్థిని ముందుగానే ప్ర‌క‌టించ‌డం కాంగ్రెస్ నైజం కాదు. ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాకే ఆ ఎంపిక ప్ర‌క్రియ‌ను పూర్తిచేస్తుంది. కానీ, ప్రస్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో ద‌ళితుణ్ని ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ముందుగా ప్ర‌క‌టిస్తే ఎన్నిక‌ల్లో ల‌బ్ధి చేకూరే అవ‌కాశ‌ముంద‌ని చంద్ర‌బాబు బ‌లంగా వాదించార‌ట‌. గ‌తంలో కేసీఆర్ త‌న హామీని విస్మ‌రించిన విష‌యాన్ని ప్ర‌జ‌ల‌కు గుర్తుచేసేందుకు, వారి ఓట్ల‌ను రాబ‌ట్టుకునేందుకు ఈ వ్యూహం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వివ‌రించార‌ట‌. అంతేకాదు ద‌ళితుణ్ని సీఎం చేయ‌డం వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా ద‌ళిత ఓట్ల‌ను ఆక‌ర్షించేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని కూడా సూచించార‌ట‌. దీంతో కాంగ్రెస్ కూడా క‌న్విన్స్ అయ్యింద‌ని తెలుస్తోంది. ఇంత‌కీ కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని భావిస్తున్న ఆ నేత ఎవ‌ర‌నుకుంటున్నారా? దానిపై ప్ర‌స్తుతానికి పూర్తి స్ప‌ష్ట‌త రాలేదు. కానీ.. ఖ‌మ్మం జిల్లా నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పేరు బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి మ‌ల్లును సీఎం అభ్య‌ర్థిగా సోనియా ప్ర‌క‌టిస్తారా? లేదా? అనే సంగ‌తి మ‌రికొన్ని గంట‌ల్లో తేలిపోనుంది.