Begin typing your search above and press return to search.
రాహుల్ లో అసలైన నాయకుడిని చూసిన సోనియా
By: Tupaki Desk | 25 Feb 2023 5:00 PM GMTకాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ది రెండు దశాబ్దాల రాజకీయ జీవితం. ఆయన 2004లో తొలిసారి ఎంపీ అయ్యారు. ఇప్పటికి నాలుగు సార్లు పార్లమెంట్ కి ఆయన నెగ్గుతూ వస్తున్నారు. రాహుల్ గాంధీని 2014లో దేశ ప్రధానిగా కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేసింది. అయితే దాని ఫలితం చేదుగా వచ్చింది. అప్పటికి కేవలం సాధారణ ఎంపీగా మాత్రమే రాహుల్ ఉన్నారు. కనీసం ఆయన కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కేంద్ర మంత్రిగా అయిన పనిచేసి ఉంటే ఎంతో కొంత రిజల్ట్ మారేది అన్న వారూ ఉన్నారు.
ఇక 2019 నాటికి విపక్షంలో రాహుల్ కాస్తా రాటుదేలారు. కానీ వ్యూహాలలో మాత్రం తడబడ్డారు. దాంతో నాటి ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ కి ఓటమి తప్పింది కాదు. ఇక ముచ్చటగా మూడవసారి 2024లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పదేళ్ళ క్రితం నాటి రాహుల్ కి ఇప్పటికీ తేడా స్పష్టంగా ఉంది. రాహుల్ పార్లమెంట్ లోపల కానీ బయట సభలలో కానీ సంధించే ప్రశ్నలలో తర్కం కనిపిస్తుంది.
అందులో జనం గొంతుక నుంచి వచ్చే సందేహాలు కనిపిస్తున్నాయి. అంతే కాదు ఇటీవల కాలంలో రాహుల్ ప్రధాని మోడీని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రశ్నలకు సమాధానం బీజేపీ వెతుక్కోవాల్సి వస్తోంది. లేదా దాన్ని పక్క దోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది అంటున్నారు. ఇక రాహుల్ గత ఏడాది సెప్టెంబర్ 7 నుంచి ఈ ఏడాది జనవరి 30 దాకా సుదీర్ఘమైన భారత్ జోడో యాత్ర చేశారు.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా రాహుల్ యాత్ర సాగింది. కేవలం 130 రోజులలోనే రాహుల్ నాలుగు వేల కిలోమీటర్ల దాకా నడిచి కొత్త రికార్డు సృష్టించారు. ఈ యాత్ర తరువాత రాహుల్ ఇమేజ్ పెరిగింది. అంతే కాదు ఆయన నాయకత్వ పటిమ పట్ల కాంగ్రెస్ శ్రేణులకు నమ్మకం కుదిరింది. సగటు జనాలకు కూడా రాహుల్ ఆల్టర్నేటివ్ లీడర్ గా కనిపిస్తున్నారు. దేశంలో మూడవ కూటమి అంటున్న పార్టీలు కూడా ఇపుడు రాహుల్ గురించి ఆలోచించడం మొదలెట్టాయి.
ఈ విధంగా రాహుల్ ని మార్చేసింది భారత్ జోడో యాత్ర అంటున్నారు. రాహుల్ ఎలా ఉంటారు, రాజకుమారుడిగానా సామాన్యుడిగానా అన్న డౌట్లు ఇదివరకు ఉండేవి, కానీ భారత్ జోడో యాత్ర తరువాత డౌన్ టూ ఎర్త్ రాహుల్ వ్యక్తిత్వం అని కోట్లాదిమంది జనాలకు తెలిసింది. ఇక రాహుల్ భారత్ జోడో యాత్రలో ఒక చోట కాంగ్రెస్ ఆగ్ర నాయకురాలు సోనియా గాంధీ పాల్గొన్నారు.
ఆమె ఆ యాత్రను చూశారు, రాహుల్ నాయకత్వాన్ని చూశారు. ఒక తల్లిగా కంటే సీనియర్ పార్టీ నాయకురాలిగా ఆమె ఒక అంచనాకు వచ్చారు. రాహుల్ లో లీడర్ షిప్ క్వాలిటీస్ పూర్తిగా ఉన్నాయని సోనియా గాంధీ నమ్ముతున్నారు. అందుకే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పార్టీ 85వ ప్లీనరీలో రెండవ రోజు ఆమె మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలకు స్వస్తి పలుతుకున్నట్లుగా చెప్పేశారు.
తన వారసుడిగా కాకుండా కాంగ్రెస్ పార్టీని నడిపించే నాయకుడిగా రాహుల్ భారత్ జోడో యాత్రలో పూర్తి నమ్మకం కలిగించారన్న సంతృప్తితోనే ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటున్నారు. రాహుల్ లో పరిణతి వచ్చిందని, ఆయన గతానికి వర్తమానానికి ఎంతో తేడా ఉందని సోనియా భావిస్తున్నారు. ఇక రాహుల్ చేతిలో చేతలలో కాంగ్రెస్ ముందుకు నడవాలని ఆమె కోరుకుంటున్నారు. దానికి ఇదే కరెక్ట్ సమయం అని ఆయన అంటున్నారు.
తన రాజకీయ జీవితానికి ముగింపునకు ఇంతకంటే వేరే కీలక సందర్భం లేదని ఆమె అంటున్నారు. భారత్ జోడో యాత్ర తో తన రాజకీయ జీవితాన్ని ముగించడం కంటే ఆనందం అదృష్టం లేదు అంటున్నారు. ఇక సోనియా ఒక్కసారి తన ప్రస్థానాన్ని కాంగ్రెస్ లో తన పాత్రను నెమరువేసుకున్నారు. 2004, 2009లలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే దానికి సోనియా వ్యూహాలు నాయకత్వ పటిమ కారణం.
అలా తాను తెచ్చిన యూపీయే ప్రభుత్వం రెండు సార్లు సవ్యంగా మన్మోహన్ సింగ్ నాయకత్వంలో పనిచేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ఇక మీదట యూపీయే త్రీని కేంద్రంలో స్థాపించాలంటే దానికి తగిన శక్తి సామర్ధ్యాలు రాహుల్ కి ఉన్నాయని ఆమె గట్టిగా విశ్వసితునారు. మొత్తానికి సోనియా గాంధీ సరైన సమయంలో సరైన వ్యక్తి రాహుల్ చేతిలో పార్టీని పెడుతూ తాను రాజకీయాలకు సెలవు అని చెప్పేశారు అన్న మాట. మరి తల్లి నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకున్న రాహుల్ రేపు దేశ ప్రజల నమ్మకాన్ని కూడా గెలుచుకుంటే ఆయనే కాబోయే ప్రధాని అనడంలో డౌటే లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.