Begin typing your search above and press return to search.

సోనియా స‌భ‌...టీఆర్ ఎస్ పార్టీ ఖుష్‌

By:  Tupaki Desk   |   24 Nov 2018 5:54 AM GMT
సోనియా స‌భ‌...టీఆర్ ఎస్ పార్టీ ఖుష్‌
X
కాంగ్రెస్ ముఖ్య‌నేత‌ - యూపీఏ చైర్‌ పర్సన్ సోనియాగాంధీ ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్వ‌హించిన స‌భ‌తో టీఆర్ ఎస్ పార్టీ ఖుష్ అవుతుండ‌గా - కాంగ్రెస్‌ లో ఒకింత నైరాశ్యం నెల‌కొంది. టీఆర్ ఎస్ పార్టీ ఊహించినంత నారాజ్ చేయ‌క‌పోగా కాక‌పోగా...కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకింత ఇబ్బందుల్లో ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. శుక్రవారం మేడ్చల్‌ లో నిర్వహించిన ప్రచారసభలో యూపీఏ చైర్‌ పర్సన్ సోనియాగాంధీ ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు. ఈ పాయింట్ ద‌గ్గ‌రే ఆస‌క్తిక‌రంగా మారింది. తెలంగాణ ఎన్నికల సభలో కూడా ఆంధ్రా పాటనే వినిపించారని - తెలంగాణ ప్రజలకు - రాష్ట్రానికి ఏమి చేస్తారో ఒక్కమాట కూడా చెప్పలేద‌ని టీఆర్ ఎస్ నేత‌లు అంటున్నారు. తెలంగాణ ఊసు లేకుండా సోనియా ప్రసంగం చప్పగా సాగడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ముఖం తిప్పుకొన్నారు.

టీఆర్ ఎస్ పార్టీ నేత‌లు కాంగ్రెస్ స‌భ‌ను విశ్లేషిస్తున్న తీరు ప్ర‌కారం స‌భ తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు విరుద్ధంగా సాగిందంటున్నారు. ఈ సభలో కనీసం తెలంగాణ అమర వీరుల త్యాగాలను కూడా ప్రస్తావించలేదు. కనీసం నివాళి కూడా అర్పించలేదు. ఏపీ ప్రస్తావన తీసుకొచ్చిన సోనియా.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని ఆమె పేర్కొంటూ.. పరోక్షంగా కేసీఆర్ చేపట్టిన ఉద్యమానికి తలొగ్గే రాష్ట్రం ఇచ్చామని చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఏపీకి ప్రత్యేకహాదా ఇస్తామన్న ఆమె.. తెలంగాణకు ఏమీ ఇవ్వనని చెప్పకనే చెప్పిందంటున్నారు. మున్ముందైనా అధికారంలోకి వస్తుందో రాదో తెలియని ఆ పార్టీ నేతలు తెలంగాణ గడ్డ పైకి వచ్చి ఇక్కడి ప్రజలకు ఏమిచేస్తారో చెప్పకపోగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పడమేమిటి అని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ‌రోవైపు ఈ స‌భ సోనియాను అతిథిగా మాత్ర‌మే ఆహ్వానించారే త‌ప్ప ఆమెతో రాష్ర్టానికి చేకూరే ప్ర‌యోజ‌నాలు ఏమిటో చెప్ప‌లేదంటున్నారు.

అదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు వేదిక‌గా మారిందంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకురావడం, మ‌రోవైపు మిత్ర‌ప‌క్షాల నేత‌ల‌ను ఒక్క తాటిపైకి తెచ్చి ఐక్య‌త‌ను చాటిందంటున్నారు. అదే స‌మ‌యంలో, టీఆర్ ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి త‌మ బ‌లాన్ని చూపించే అవ‌కాశం ఇచ్చిందంటున్నారు.