Begin typing your search above and press return to search.

సోనియా ఎఫెక్ట్ కాంగ్రెస్ పై ఎంతవరకు?

By:  Tupaki Desk   |   27 Feb 2023 7:00 AM GMT
సోనియా ఎఫెక్ట్ కాంగ్రెస్ పై ఎంతవరకు?
X
తెలంగాణ కాంగ్రెస్ లో నిరాశ ఆవహించింది. ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న సోనియా గాంధీ ఇప్పుడు తప్పుకుంటే ఆ ప్రభావం ప్రజలపై, ఓట్లపై పడుతుందని టీపీసీసీ భావిస్తోందట.. తెలంగాణ తల్లి అంటూ సోనియాను ముందుకెళ్లి రేవంత్ రెడ్డి ముందుకెళుతున్నాడు.

తెలంగాణ ఇచ్చిన సోనియా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని రేవంత్ రెడ్డి సహా నేతలు కోరుకుంటున్నారు. సోనియమ్మ రాజ్యం తెస్తామంటూ.. యూపీఏ పాలనలోని పథకాలను గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ ప్రకటనతో రాష్ట్ర పార్టీలో గందరగోళం నెలకొంది.

వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న దశలో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియాగాంధీ రిటైర్ మెంట్ ప్రకటన టీ కాంగ్రెస్ ను కుంగదీసింది. పాతికేళ్ల పాటు పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించిన సోనియా ఇక రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించడం ఆసక్తి రేపింది. ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె చేయకపోవచ్చని.. ప్రస్తుతం గెలిచిన రాయబరేలి నుంచి ఆమె కూతురు ప్రియాంక పోటీచేసే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

సోనియా గాంధీ అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతోంది. క్రియాశీల రాజకీయల నుంచి దూరంగా ఉండాలని అనుకుంటోంది. కేవలం పార్టీ అధ్యక్ష బాధ్యతల గురించి మాట్లాడుతున్న సోనియా ఈ వ్యాఖ్యలు చేసినందున కేవలం దానికి ఆమె కామెంట్స్ మాత్రమే పరిమితమని.. మొత్తానికి యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలన్నది సోనియా ఉద్దేశం కాదని కాంగ్రెస్ సీనియర్లు క్లారిటీ ఇచ్చారు.

రెండు సార్లు యూపీఏ విజయంతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి సోనియా కీలక పాత్ర పోషించారు. ఇది పార్టీకి, దేశానికి సవాలు లాంటి సమయం. మోడీ మూడోసారి గెలిస్తే కాంగ్రెస్ ఉండదిక. ప్లీనరీలో సరికొత్త రచ్చకు దారితీసిన సోనియా ప్రసంగం చూస్తే ఆమె రిటైర్ మెంట్ తగదని అంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ ఊపు మీదుంది. రేవంత్ జోరుమీదున్నాడు. ఈ టైంలో సోనియా రాజీనామా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. సోనియాతో వచ్చేసారి ప్రచారం చేయించాలని లబ్ధిపొందాలని చూసిన టీపీసీసీకి ఈ ప్రకటన షాకిచ్చింది.