Begin typing your search above and press return to search.
సోనియమ్మదే ఫైనల్ డెసిషన్
By: Tupaki Desk | 15 May 2023 9:18 AM GMTకొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్నది నిర్ణయం తీసుకోవాల్సింది ఇక కాంగ్రెస్ హై కమాండ్ మాత్రమే. సంపూర్ణ అధికారాలు హై కమాండ్ కి అప్పగిస్తూ కన్నడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా ఏక వాక్య తీర్మానాన్ని ఆమోదించారు.
ఎంతో ఉత్కంఠగా సాగిన సీఎల్పీ సమావేశం కొత్త సీఎం ఎవరో తేల్చలేకపోయింది. అంతా సోనియమ్మ ఇష్టం అంటూ చెప్పేసింది. ఎమోషనల్ ఫీల్ తో పాటు హై లెవెల్ పొలిటికల్ డ్రామాగా సాగిన సీఎల్పీ మీటింగ్ లో జస్ట్ ఒకే ఒక సెంటెన్స్ తో మమ అనిపించేశారు.
దానికి ముందు కాంగ్రెస్ ఆనవాయితీ ప్రకారం కేంద్ర నాయకత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీ సుశీల్ కుమార్ షిండే నాయకత్వంలో ఢిల్లీ నుంచి వచ్చి గెలిచిన మొత్తం 136 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో విడిగా మాట్లాడి వారి నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. దాని వారు నోట్ చేసుకుని శ్రద్ధగా హై కమాండ్ కి నివేదిక రూపంలో అందచేస్తారు.
అలా వన్ టూ వన్ గా ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫీడింగ్ ఏంటి అన్నది కాంగ్రెస్ కి తెలుస్తుంది. దానితో పాటు పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివ కుమార్ తనకు హై కమాండ్ డెసిషన్ శిరోధార్యం అని చెప్పేశారు. అయితే వక్కలిగ సమాజికవర్గం మరో వైపు పట్టుపడుతోంది.
మఠాధిపతులు సైతం డీకే కే చాన్స్ ఇవ్వాలని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంతో సిద్ధరామయ్య అని మొదట అనుకున్నా కాంగ్రెస్ కొంత ఆలోచనలో పడింది అని అంటున్నారు డీకే శివ కుమార్ కే సీఎం పదవి ఇవ్వాలని అంతా కోరుతున్న నేపధ్యంలో ఇక లాభం లేదని డెసిషన్ ని కాంగ్రెస్ హై కమాండ్ తన చేతుల్లోకి తీసుకుంది అని అంటున్నారు.
దాంతో పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో డీకే శివ కుమార్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మొత్తం సీఎల్పీ సభ్యులు ఆమోదించి హై కమాండ్ దే ఫైనల్ అనేశారు. మరి కేంద్ర నాయకత్వం ఎపుడు డెసిషన్ ప్రకటిస్తుంది అంటే ఒకటి రెండు రోజులు అంటున్నారు. ఈ నెల 17 కానీ 18 కానీ కొత్త కాంగ్రెస్ సీఎం ప్రమాణం చేయవచ్చు అని అంటున్నారు.
ఇక ఒక ఫార్ములా ప్రకారం చూస్తే సిద్ధరామయ్యకు రెండేళ్ళ పదవీ కాలం ఇచ్చి ఆయన మంత్రివర్గంలో డీకే శివకుమార్ ని డిప్యూటీ సీఎం ని చేసి కీలకమైన హోం శాఖను ఇవ్వాలని చూస్తున్నారుట. అయితే సీఎం పదవికే డీకే వర్గీయులు పట్టుపడుతూండడంతో తొలి చాన్స్ ఆయనకే ఇచ్చి మలి చాన్స్ సిద్ధరామయ్యకు ఇస్తారా అన్నది మరో చర్చ. ఏది ఏమైనా ఇద్దరికీ న్యాయం చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దీంతో మరో రెండు మూడు రోజుల సమయం పడుతుందని అంటున్నారు. సో అప్పటిదాకా వెయిట్ అండ్ సీ.