Begin typing your search above and press return to search.

అమ్మాకూతుళ్లు సిమ్లాలో ఎంజాయ్ చేశారట

By:  Tupaki Desk   |   14 Jun 2016 11:54 AM GMT
అమ్మాకూతుళ్లు సిమ్లాలో ఎంజాయ్ చేశారట
X
వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. మరి ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారన్న విషయాల్ని క్రాస్ చెక్ చేస్తే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. తరచూ తగులుతున్న ఎదురుదెబ్బల నుంచి రిలాక్స్ అవ్వాలనున్నారో.. టైం బాగోలేని సమయలో కలిసి రాని అంశాల విషయాల్ని పట్టించుకోవటం కన్నా.. కాస్త దూరంగా వెళ్లాలని అనుకున్నారేమో కానీ.. సోనియాగాంధీ.. ఆమె గారాల పట్టి ప్రియాంక గాంధీ ఇద్దరూ కలిసి సిమ్లాలో ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఢిల్లీ నుంచి సోనియా.. ప్రియాంక గాంధీలు ఇద్దరూ సిమ్లాలో ప్రత్యక్ష కావటమేకాదు.. ఈ చల్లటి ప్రదేశంలో అమ్మాకూతుళ్లు ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారని చెబుతున్నారు. సిమ్లాలో ప్రియాంక కొత్తగా కట్టుకున్న ఇంటిని పరిశీలించారని.. వారు సంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా నిర్మాణం పూర్తి కావొస్తున్నప్రియాంక ఇల్లు.. సోనియాకు బాగానే నచ్చిందట. నిత్యం రాజకీయాల్లో బిజీబిజీగా ఉండే సోనియాలాంటి వారు ఆటవిడుపు కోసం జరిపే పర్యటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయనే చెప్పాలి. ఇందుకు.. సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న వారి ఫోటోలే నిదర్శనమని చెప్పక తప్పదు.