Begin typing your search above and press return to search.

ఏమాటకు ఆ మాటే చెప్పాలి.. కాంగ్రెస్ ఇమేజ్ మార్చిన సోనియా

By:  Tupaki Desk   |   26 Feb 2023 11:18 AM GMT
ఏమాటకు ఆ మాటే చెప్పాలి.. కాంగ్రెస్ ఇమేజ్ మార్చిన సోనియా
X
కాంగ్రెస్ పార్టీ అంటేనే కపటం అన్నట్లుగా ఉండేది. ఇదే తీరును చాలామంది తమ మాటలతో చెప్పటమే కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సందర్భాల్లో అలా వ్యవహరించిందో విశ్లేషించి మరీ చెప్పేవారు. మిత్రులకుఏ మాత్రంనమ్మకస్తురాలు కాదన్న చెడ్డపేరు కాంగ్రెస్ కు ఉంది. ఎప్పుడూ తన ప్రయోజనం.. స్వార్థమే తప్పించి..మాట మీద నిలబడేగుణం ఆ పార్టీకి తక్కువన్న చెడ్డపేరు కాంగ్రెస్ కు ఉండేది. అయితే.. అదంతా కూడా సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ రథసారధిగా బాధ్యతలు చేపట్టక ముందు.

చెప్పిన మాట మీద నిలబడకపోవటం.. తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో దుర్మార్గంగా వ్యవహరించే విషయంలో కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డు ఏ మాత్రం గొప్పగా అనిపించదు. ఆ విషయంలో కాంగ్రెస్ కున్న చెడ్డపేరును తొలగించే విషయంలో సోనియాగాంధీ కష్టపడ్డారని చెప్పాలి. ఎన్నో పరీక్షలకు ఎదుర్కొని.. తాను చెప్పిన మాట మీద నిలబడే వ్యక్తినని.. అప్పటి వరకు కాంగ్రెస్ అనుసరించే చాలా తప్పుడు విధానాల్ని మార్చేయటంలో ఆమె కీలకభూమిక పోషించారని చెప్పాలి.

మిత్రపక్షాలకు మిత్రుడిగా వ్యవహరిస్తూ.. వారిని ఎదగనీయకుండా చేయటంలో కాంగ్రెస్ ఎప్పుడూ కుయుక్తులు ప్రదర్శించేది. అలాంటి వాటికి చెక్ చెప్పిన ఘనత సోనియాగాంధీ. తనకు పూర్తి మెజార్టీ రాని వేళ.. మిత్రపక్షానికి అధికారం వచ్చేలా చేసి.. తానుమద్దతు ఇస్తున్నట్లే నటించి.. ఆ తర్వాత సదరు పార్టీని నట్టేట ముంచేసి.. ఆ పార్టీ నేతల్లో చీలిక తీసుకొచ్చి.. వారిని తమ గూటికి తెచ్చుకొని అధికారంలోకి వచ్చే దుష్టసంప్రదాయానికి సోనియా చెక్ పెట్టారన్న మాట వినిపిస్తుంది.

కాంగ్రెస్ అన్నంతనే కన్నింగ్ పార్టీగా పేరుండేది. దాన్ని నమ్మకస్తుడైన మిత్రపక్షమన్న ఇమేజ్ కు సోనియాగాంధీనే కారణమని చెప్పక తప్పదు. పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టిన నాటి నుంచి ఆమె ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించారు. మిత్రపక్షాల్ని వీలైనంతవరకు కలుపుకుపోవాలన్న లక్ష్యానికి తగ్గట్లే ఆమె పని తీరు ఉందని చెప్పాలి. ఇవే కాదు.. తన నోటి నుంచి ఏదైనా మాట వచ్చిందంటే.. దాన్ని పూర్తి చేసేందుకు దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే పట్టుదల సోనియా సొంతంగా చెబుతారు. ఈ గుణమే తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని చెప్పాలి.

తాను తెలంగాణకు అనుకూలమని.. రాష్ట్ర విభజనకు మాట ఇచ్చానన్న ఒక్క కమిట్ మెంట్ ను అంతటి వ్యతిరేకతను అధిగమించి..రెండు తెలుగురాష్ట్రాలుగా మార్చిన ఘనత సోనియాదేనని చెప్పాలి. తెలంగాణ ప్రజలకు తాను ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని మాట ఇచ్చానని.. దాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆమె ఎంతలా కసరత్తు చేశారో.. తెలంగాణ కోసం వచ్చే వ్యతిరేకతకు అడ్డంగా నిలబడి.. తాను మాట ఇచ్చినట్లే తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయం సరిగిపోయిందని చెప్పాలి. ఇలాంటి తీరుకాంగ్రెస్ పార్టీలో మరే అధినేతలోనూ కనిపించదని చెప్పక తప్దపు.