Begin typing your search above and press return to search.
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్... సోనియా ఈస్ బ్యాక్!
By: Tupaki Desk | 13 July 2023 2:03 PM GMTచాలాకాలంగా సోనియా గాంధీ క్రియాశీల రాజకీయాల కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆనారోగ్య కారణాల తోనే ఆమె పార్టీలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటంలేదని అంటున్నారు. ఫలితంగా... జాతీయ అధ్యక్ష బాధ్యతలను సైతం వదిలేసుకున్నారని చెబుతుంటారు. అయితే మరోసారి సోనియా క్రియాశీల రాజకీయాల పై దృష్టిపెట్టబోతున్నారని తెలుస్తుంది!
కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం తేవడంతో పాటు.. బీజేపీకి ప్రతిపక్షాలుగా ఉంటున్న పార్టీల కు కొత్త ధైర్యాన్ని కూడా ఇచ్చాయని అంటున్నారు పరిశీలకులు. అందులో భాగంగా... కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపుగా విపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చాయని చెబుతున్నారు. అతే కాకుండా... వారంతా కాంగ్రెస్ పార్టీని పెద్దన్నను చేశారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో... దేశవ్యాప్తంగా చిన్నా చితకా కలిపి సుమారు 24 పార్టీలు బెంగళూరు లో సమావేశం కాబోతున్నాయని తెలుస్తుంది. కాగా, గత నెల లో బీహార్ రాజధాని పాట్నా లో జరిగిన సమావేశానికి 17 పార్టీలు హాజరయిన సంగతి తెలిసిందే. బీజేపీ సర్కార్ ని గద్దెదింపడమే లక్ష్యంగా వీరంతా ఏకతాటి పైకి వస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే... ఈ సందర్భంగా... బెంగళూరు లో ఈనెల 17,18 తేదీల్లో జరగబోయే ఈ ప్రతిపక్షాల సమావేశం లో సోనియా గాంధీ పాల్గొనబోతున్నారని అంటున్నారు. దీంతో... ఈ సమావేశం లో సోనియాగాంధీయే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్నారనే కామెంట్లు మొదలైపోయాయి.
ఇదే సమయం లో సమావేశం అనంతరం రాత్రికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విందు ఏర్పాటుచేశారని అంటున్నారు. ఆ విందు కార్యక్రమంలో కూడా సోనియా పాల్గొనబోతున్నారని చెబుతున్నారు. దీంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యత పెరిగిందని తెలుస్తుంది.
ఏది ఏమైనా... బెంగుళూరు లో జరగబోయే మీటింగు కు కాంగ్రెస్ పార్టీయే అధ్యక్షత వహించబోతోందని మాత్రం స్పష్టమవుతుందని అంటున్నారు. కాగా, పాట్నాలో జరిగిన సమావేశం లో అలిగిన కేజ్రీవాల్ మధ్య లోనే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ కూడా ఈ సమావేశల కు హాజరుకాబోతున్నారని అంటున్నారు.
అయితే పార్టీల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యల వల్ల పెద్ద పెద్ద ఐక్యత దెబ్బతింటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని తెలుస్తుంది. దీంతో... ఇక అలాంటి చిన్న చిన్న సమస్యల ను సోనియా గాంధీ పరిష్కరించబోతున్నారని తెలుస్తుంది. ఈ సమావేశాల్లో ముఖ్యంగా కలిసి పోరాడటం.. సీట్ల సర్ధుబాటు.. అవసరమైన చోట త్యాగాలు గురించి చర్చించబోతున్నారని అంటున్నారు!
మరి మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతోన్న ఈ సమావేశాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయి.. కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా ప్రయాణించడానికి ఏ మేరకు ఉపయోగపడతాయనేది వేచి చూడాలి.