Begin typing your search above and press return to search.

అందరూ వద్దన్న పదవి సోనియాకు కట్టబెట్టారు

By:  Tupaki Desk   |   11 Aug 2019 5:18 AM GMT
అందరూ వద్దన్న పదవి సోనియాకు కట్టబెట్టారు
X
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని భర్తీ చేశారు. కొడుకు చేతులెత్తేసిన తరువాత పార్టీలోని మిగతా నేతలూ మాకొద్దంటే మాకొద్దని చెప్పేయడంతో చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా గాంధీయే మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. దీంతో కొద్దిరోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడింది.

తొలుత గాంధీ కుటుంబేతర వ్యక్తికి అధ్యక్ష పదవి అప్పగిస్తారని ప్రచారం జరిగినా చివరికి కుటుంబానికి - పార్టీకి పెద్ద దిక్కు - పాత కాపు అయిన సోనియా గాంధీకి పగ్గాలు అప్పగించారు. నేతల వినతి మేరకు సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కన్నా .. కశ్మీర్ ఇష్యూ సీరియస్ అని మీడియాతో మాట్లాడి ఆయన వెళ్లిపోయారు.

ఎన్నికల ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ బాస్ పోస్ట్ ఖాళీగా ఉంది. మళ్లీ పగ్గాలు చేపట్టాలని నేతలు కోరినా .. రాహుల్ అందుకు విముఖత వ్యక్తం చేశారు. ఈ సమయలోనే తెలంగాణలో సీఎల్పీ విలీనం - గోవాలో సీఎల్పీ విలీనం - కర్ణాటకలో ప్రభుత్వం పడిపోవడం వంటివన్నీ జరిగాయి. దీంతో అధ్యక్షుడు లేకుండా పార్టీ ఉండటం సరికాదని అభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కోసం ముకుల్ వాస్నిక్ - మల్లికార్జున ఖర్గే - కేసీ వేణుగోపాల్ పేర్లు వినిపించినా .. నేతలంతా సోనియా వైపే మొగ్గుచూపారు.

అంతకుముందు చాలా డ్రామా నడిచింది. కాంగ్రెస్ కమిటీలన్నీ రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా ఉండాలని కోరాయి. అయినా ఆయన నిరాకరించడంతో చివరికి రాజీనామా ఆమోదించారు. అసలు ఆ సమావేశానికే తాను రానని రాహుల్ చెప్పగా.. సీనియర్ నేతలు - కుటుంబసభ్యులు కోరడంతో మొక్కుబడిగా హాజరయ్యారు.