Begin typing your search above and press return to search.
జూన్ లో సోనియా.. రాహుల్ ఇద్దరు ఒకేసారి హైదరాబాద్ కు
By: Tupaki Desk | 12 May 2023 10:23 AM GMTఆసక్తికర సన్నివేశానికి హైదరాబాద్ వేదిక కానుంది. ఇప్పటివర కు ఎప్పుడూ లేని రీతిలో ఒకే రోజు.. ఒకే సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఆమె కుమారుడు కమ్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత రాహుల్ గాంధీలు ఇద్దరూ ఒకే సమయంలో.. హైదరాబాద్ మహానగరానికి వస్తున్నారు.
వీరిద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొంటున్న ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకోనుంది. సికింద్రాబాద్ బోయినపల్లి లోని పది ఎకరాల స్థలంలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గాంధీ ఐడియాలజీ సెంటర్ భవన నిర్మాణానికి సోనియా గాంధీ శంకుస్థాపన చేస్తారు.
జూన్ లో జరిగే ఈ కార్యక్రమానికి సోనియాతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు.. రాహుల్ గాంధీ ఇతర కీలక కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ కు రానున్నట్లు చెబుతున్నారు. జూన్ మొదటి వారంలో ఈ కార్యక్రమం ఉంటుందని చెబుతున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి సుమారుపది ఎకరాల స్థలాన్ని బోయినపల్లి శివారులో కేటాయించారు.
ఈ స్థలంలోకాంగ్రెస్ సీనియర్ నేత.. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి కంటోన్మెంట్ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా.. తాజాగా జరిగిన కంటోన్మెంట్ బోర్డు పాలకమండలిలో జీ ప్లస్ 2 భవనానికి అనుమతులు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ పనుల్ని చేపట్టాలని టీపీసీసీ భావిస్తోంది. ఈ భవనాన్ని పార్టీ జాతీయ స్థాయి అవసరాలకు వినియోగించనున్నారు.
గాంధీ భావజాలాన్ని తెలిపే లైబ్రరీతో పాటు.. పార్టీ సిద్ధాంతాలు.. కార్యక్రమాల్ని చూసేందుకు వీలుగా థియేటర్.. గాంధీ కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు వచ్చినప్పుడు బస చేసేందుకు వీలుగా ఈ భవనాన్ని రూపొందించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడికి ఇందులో ప్రత్యేక ఛాంబర్ ను ఏర్పాటు చేస్తారు. ఈ భవన శంకుస్థాపన కారణంగా సోనియా.. రాహుల్ ఒకే రోజు హైదరాబాద్ లో ఒకే కార్యక్రమంలో దర్శనం ఇవ్వనున్నారు.