Begin typing your search above and press return to search.
గులాబీ పార్టీకి దెబ్బేస్తున్న సన్‌స్ట్రోక్‌లు.. ఇలాగైతే కష్టమేనట
By: Tupaki Desk | 15 Jan 2022 4:30 PM GMTఅధికారంలో లేని వేళ ఎదురయ్యే ఇబ్బందులు ఒకలా ఉంటే.. అప్పుడే అధికారంలోకి వచ్చిన పార్టీలో మరోలాంటి సమస్యలు ఉంటాయి. వీటన్నింటికి మించిన ఇబ్బందులు.. నాన్ స్టాప్ గా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ కు ఇలాంటి అనుభవమే ఎదురవుతోంది. గడిచిన ఏడేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. మరో రెండేళ్లు ప్రభుత్వం ఉంటుంది. తర్వాత జరిగే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. ప్రజలు తమకు తాము టీఆర్ఎస్ ను తిరస్కరించటానికి ముందు.. గులాబీ నేతల కుటుంబ సభ్యుల తీరు పుణ్యమా అని అధికార పార్టీకి అనుకోని షాకులు తగులుతున్నట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతల కుమారులు పెద్ద ఎత్తున ఉన్నారు.
వారంతా తమ తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకోవటానికి సిద్ధమవుతున్నారు.మరోవైపు.. కొన్నిచోట్లు కుమార్తెలు సైతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. తమ తండ్రులకున్నఅధికారాన్ని తమ సొంతమన్నట్లుగా భావించి.. పవర్ ను చెలాయిస్తున్న వారు.. అనుకోని విధంగా సమస్యల్లోకి ఇరుక్కుంటున్నారు. వీరి తీరు కారణంగా గులాబీ పార్టీకి కొత్త కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పాలి. తమ పార్టీ ఎమ్మెల్యేలను నిత్యం ప్రజల్లో ఉండాలని.. ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండటం ద్వారా.. ఎన్నికల్లో గెలుస్తామని సీఎం కేసీఆర్ తరచూ చెబుతుంటారు. అయితే.. నేతల వారసుల చేష్టల కారణంగా టీఆర్ఎస్ కు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయన్న మాట వినిపిస్తోంది.
ఇటీవల ఖమ్మం జిల్లాలో సీనియర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ ఎపిసోడ్ తెలిసిందే. ఈ వ్యవహారం తెలంగాణ అధికారపార్టీని ఇరుకున పడేలా చేయటంతో పాటు.. ఇలాంటివి పార్టీ మొత్తానికి చెడ్డపేరు తీసుకొస్తాయని చెబుతున్నారు. ఒక కుటుంబం మొత్తం చావుకుకారణమైన నేత..దానికి అతగాడి వ్యవహారశైలి మింగుడపడేలా లేదంటున్నారు. ఈ ఎపిసోడ్ లో వనమా రాఘవపై వేటు వేయటానికి కొద్ది రోజులు టైం తీసుకున్నారు.
బాధితుడిసెల్ఫీ వీడియో బయటకు రావటం.. అది కాస్తా వైరల్ అయి.. ఇలాంటి నేత తమ పార్టీలో ఉంటే జరిగే నష్టం భారీగా ఉంటుందన్న నిర్ణయానికి వచ్చిన తర్వాత.. అతడిపై చర్యలకు నిర్ణయం తీసుకున్నారు. కానీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగినట్లు చెబుతారు. వనమా రాఘవ ఎపిసోడ్ బయటకు వచ్చిందని.. పలువురు టీఆర్ఎస్ నేతల కుటుంబాల్లోని రాజకీయ వారసుల చేష్టలు మితిమీరిపోతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా పార్టీ మీద మరింత ఫోకస్ చేయటం ద్వారా.. పార్టీకి తగిలే సన్ స్ట్రోకులు తగలకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వారికి సంబంధించిన జాబితాను కేసీఆర్ సిద్ధం చేయిస్తున్నట్లు చెబుతున్నారు.