Begin typing your search above and press return to search.

101 ఏళ్ల తండ్రి డెడ్ బాడీని 18 నెలలుగా ఫ్రిజ్ లో దాచేశాడు

By:  Tupaki Desk   |   13 May 2023 5:00 AM GMT
101 ఏళ్ల తండ్రి డెడ్ బాడీని 18 నెలలుగా ఫ్రిజ్ లో దాచేశాడు
X
షాకింగ్ ఉదంతం ఒకటి నెదర్లాండ్స్ లో బయటకు వచ్చింది. 101 ఏళ్ల వయసులో ఉన్న తండ్రి మరణిస్తే.. అతడి 82 ఏళ్ల కుమారుడు డెడ్ బాడీని ఫ్రిజ్ లో దాచి ఉంచిన వైనం షాకింగ్ గా మారింది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు.. ఇంటిని సోదా చేయగా.. ఫ్రిజ్ లో డెడ్ బాడీ ఉన్న విషయాన్ని గుర్తించారు. అయితే.. ఏ పరిస్థితుల్లో మరణించి ఉంటారన్న అంశంపై విచారణ జరుపుతున్నారు. అదే సమయంలో.. కొడుకును ప్రశ్నించగా.. తన తండ్రిని చూడకుండా ఉండలేనని.. ఆయన్ను మిస్ అవుతానన్న ఉద్దేశంతో ఫ్రిజ్ లో ఉంచినట్లు చెప్పారంటున్నారు.

అయితే.. తన తండ్రి మరణించిన విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. చనిపోయిన తర్వాత కూడా తన తండ్రితో రోజు మాట్లాడుతున్నట్లుగా కొడుకు చెప్పారట. అయితే..కొడుకు ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదంటున్నారు. ఇల్లు మొత్తం సరిగా లేదని.. వస్తువులు చిందరవందరగా పడి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే.. తండ్రి మరణంపై సందేహాలు లేవంటున్నారు.

ఈ ఉదంతం బయటకు వచ్చిన వేళ.. ఆ మధ్యన నెదర్లాండ్స్ లోనే ఇదే తరహా ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి తన తల్లి డెడ్ బాడీని ఇంట్లోని ఫ్రిజ్ లో దాచి ఉంచాడు. దీనికి కారణం.. తల్లికి వచ్చే పింఛన్ డబ్బులు కోసం ఇలా చేశాడన్న విషక్ష్ం బయటకు వచ్చింది.

దీంతో.. అతనికి రూ.36 లక్షల మొత్తాన్ని జరిమానాగా విధించారు. అయితే.. తాజా ఉదంతంలో మాత్రం సదరు పెద్ద వయస్కుడు అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నట్లుగా తెలుస్తోంది.

"చాలా కాలంగా ట్యూమర్ తో బాధ పడుతున్నాడు. తరచూ ఆసుపత్రికి కూడా వెళ్లి వస్తుంటారు" అని ఇరుగుపొరుగు వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. 101 వ్యక్తి మరణం గురించి ఫ్యామిలీ డాక్టర్ అందించిన సమాచారంతో విషయం బయటకు వచ్చింది. కొడుకు వయసు సైతం 82 ఏళ్లు కావటంతో అతను సరిగా నడవలేకపోతున్నట్లుగా చెబుతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత ఎక్కువగా విచారణ చేయటం సాధ్యం కాదని.. మరో వారం తర్వాత విచారణ చేపడతామని చెబుతున్నారు.