Begin typing your search above and press return to search.
మోడీ జగన్ మధ్యలో ఏదో జరుగుతోంది...?
By: Tupaki Desk | 9 Feb 2023 5:00 AM GMTతనకు బీజేపీతో రాజకీయ బంధం లేదని, మోడీతోనే బంధం అంటూ ఇప్పటికి నాలుగు నెలల క్రితం విశాఖ సభలో చాలా ఎమోషనల్ గా చెప్పారు ఏపీ సీఎం జగన్. పైగా అది రాజకీయాలకు అతీతం అని ఆయన చెప్పారు. అంటే మోడీలో తండ్రిని ఒక పెద్దను గురువును చూసుకుంటున్నాను అన్న అర్ధం వచ్చేలాగానే జగన్ మాట్లాడారు. దీనికి కాస్తా వెనక్కి వెళ్తే అనంతపురం అప్పట్లో వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీలో ఎంతో చేస్తున్నమని, ఇంకా కావాలంటే అడిగే చనువు తీసుకునే హక్కు ఏపీ సీఎం జగన్ కి ఉన్నాయని చెప్పారు.
మోడీ జగన్ ల మధ్యలో ఉన్నది తండ్రీ కొడుకుల బంధం అని ఆమె కూడా ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఇదంతా నాలుగేళ్లుగా సాగుతూ వస్తున్న ముచ్చట. 151 సీట్ల భరీ మెజారిటీతో ఏపీని గెలిచి ఢిల్లీ వెళ్ళిన జగన్ తొలిసారి ప్రధాని మోడీని కలసినపుడు ఆయన ఒక కొడుకుని ఆలింగనం చేసుకున్నట్లే చేసుకున్నారు. ఆ ఫోటో అప్పటికీ ఇప్పటికీ కొత్తగానే ఉంటుంది.
ఇక జగన్ ఎపుడు ఢిల్లీ వెళ్ళినా ప్రధాని మోడీని కలసిరాకుండా ఉండరు. ఇక మోడీతో జగన్ ఎపుడూ గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవు. ఇంకో ముచ్చట కూడా చెప్పుకోవాలి. ప్రధాని మోడీ ఒకసారి తిరుపతి వచ్చినపుడు జగన్ ఆయన కాళ్ళకు పాదాభివందనం కూడా చేయబోయారు. ఆయన్ని సున్నితంగా ప్రధాని మోడీ అడ్డుకుని పైకిలేపారు. ఇంతల సాన్నిహిత్యంతో ఉన్న మోడీ జగన్ ల మధ్యలో రాజకీయం చేరిందా అంటే అవును అనే అనుకోవాలి.
ఆ మాటకు వస్తే రాజకీయాల్లో బంధాలు పలుచన అన్నది తెలిసిందే. సొంత వారి మధ్యనే కత్తులు దూసే పరిస్థితు ఉంటుంది. అలాంటిది మోడీ జగన్ ల బంధం కూడా బీటలు వారుతుంది అంటే ఆశ్చర్యం అయితే ఎవరికీ లేదు. ఇద్దరికీ ఉమ్మడి శత్రువు చంద్రబాబు కాబట్టి కలిశారు అనుకోవాలి. ఇక ఏపీలో జగన్ బలంగా ఉంటే మోడీ మరింతకాలం ఆయనతో చేతులు కలిపే వారు అని కూడా అంటారు ఏపీలో వైసీపీ గ్రాఫ్ బాగా పడిపోతోందని అంటున్నారు.
ఇంకో వైపు చంద్రబాబు కేంద్రంతో సంఖ్యత కోసం అర్రులు చాస్తున్నారు. ఆయన రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న వారు. జగన్ని వదిలేసినా ఆయన వెళ్ళి కాంగ్రెస్ తో చేతులు కలపరు. కానీ బాబు అలా కాదు ఢిల్లీ వచ్చి కుడి ఎడమలను అన్నింటినీ ఏకం చేసి బీజేపీకి ఏ మాత్రం సీట్లు తగ్గినా కేంద్రంలో కొత్త సర్కార్ ని ప్రతిష్టించగలరు. ఇంకోవైపు చూస్తే తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి ఎదగాలని ఉంది. చంద్రబాబుతో ఉంటే అటు తెలంగాణా ఇటు ఏపీ రెండూ సేఫ్ జోన్ లో ఉంటాయన్న లెక్కలేవో కమలానికి ఉన్నాయని అంటున్నారు.
అందుకే గత కొన్నాళ్ళుగా చూస్తే సీబీఐ దూకుడు పెరుగుతోంది. అదే టైం లో పార్లమెంట్ లో కూడా ఏపీ అప్పుల కుప్ప అని నిన్నటికి నిన్న పంకజ్ చౌదరి తేలిస్తే ఈ రోజు అమరావతి ఏపీ రాజధాని అంటూ నిత్యానంద రాయ్ కుండబద్ధలు కొట్టారు. ఏపీకి సంబంధించి ఇలా షాకుల మీద షాకులు ఇస్తూ కేంద్రం తన ఎత్తులతో వైసీపీని చిత్తు చేస్తోంది అని అంటున్నారు.
ఇక వైసీపీ వైపు నుంచి చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు ఇపుడు జోరు మీద సీబీఐ విచారణ సాగుతోంది. ఇక జగన్ కేసులలో విచారణ కూడా వేగవంతం అయింది అని అంటున్నారు. వివేకా హత్య కేసులో జగన్ ఓఎస్డీని, ఆయన సతీమణి భారతి సహాయకుడు నవీన్ కి కూడా విచారించింది. ఇక హైదరాబాద్ సీబీఐ కోర్టు నిందితులకు సమన్లు కూడా జారీ చేసింది. అతి తొందరలోనే వివేకా కేసు తేలిపోతుంది అని అంటున్నారు.
ఇక జగన్ కేసులలో విచారణ కూడా వేగం పుంజుకుంటోంది అని అంటున్నారు. ఎన్నికల ముందు సీబీఐ ఈడీ కోర్టులు తమ తీర్పులు వెలువరిస్తారు అని అంటున్నారు. ఇలా కనుక చూసుకుంటే నాలుగేళ్ళ స్నేహం వల్ల కేంద్రం నుంచి పెద్దగా సాయం లేదు, ప్రత్యేక హోదా అటకెక్కింది. ప్రత్యేక నిధులు అయితే లేవు, మరో వైపు చూస్తే కేసులు కూడా వేగం పుంజుకున్నాయి. దాంతో పార్లమెంట్ వేదికగా వైసీపీ స్వరం మార్చింది అని అంటున్నారు.
ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ బీజేపీ మోసం చేశాయని విజయసాయిరెడ్డి ఘాటైన ఆరోపణలే చేశారు. అలాగే మూడు రాజధానుల విషయంలో కూడా అమరావతి అంటూ కేంద్రం గట్టిగా చెప్పేసరికి వైసీపీకి పాలుపోవడం లేదు అంటున్నారు. ఎన్నికల ఏడాది కేంద్రంతో ఢీ కొడితే లాభమా నష్టమా అన్నది తేల్చుకున్న తరువాతనే వైసీపీ తదుపరి వ్యూహాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.